Fat : వీటితో శరీరంలో కొవ్వు మొత్తం కరుగుతుంది తెలుసా?

Fat : శరీరంలో కొవ్వు పేరుకుపోతే సమస్యలు వస్తాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తసరఫరాపై ప్రభావం పడుతుంది. దీంతో ఇతర సమస్యలకు కారణంగా మారుతుంది. కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె సంబంధిత రోగాలు రావచ్చు. చాతిలో నొప్పి వస్తుంది. మెదడు పనితీరు మందగిస్తుంది. కాలేయ సంబంధిత రోగాలు కూడా తలెత్తుతాయి. ఇలా వ్యాధులకు నియలంగా మారిపోతుంటాం. అందుకే కొవ్వు శరీరంలో చేరకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. కొవ్వు ఎవరిలో.. కొవ్వు ఎవరిలో ఎక్కువగా పెరుగుతుంది? ఎవరికి […]

Written By: Srinivas, Updated On : March 20, 2023 11:43 am
Follow us on

Fat : శరీరంలో కొవ్వు పేరుకుపోతే సమస్యలు వస్తాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తసరఫరాపై ప్రభావం పడుతుంది. దీంతో ఇతర సమస్యలకు కారణంగా మారుతుంది. కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె సంబంధిత రోగాలు రావచ్చు. చాతిలో నొప్పి వస్తుంది. మెదడు పనితీరు మందగిస్తుంది. కాలేయ సంబంధిత రోగాలు కూడా తలెత్తుతాయి. ఇలా వ్యాధులకు నియలంగా మారిపోతుంటాం. అందుకే కొవ్వు శరీరంలో చేరకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం.

కొవ్వు ఎవరిలో..

కొవ్వు ఎవరిలో ఎక్కువగా పెరుగుతుంది? ఎవరికి కొవ్వు సమస్య వస్తుంది? ధూమపానం, మద్యపానం చేసే వారిలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోతుంది. ఇంకా వ్యాయామం చేయని వారిలో, జంక్ ఫుడ్స్ తీసుకునే వారిలో, ఒత్తిడికి గురయ్యే వారిలో, డయాబెటిస్ తో బాధపడే వారిలో కొవ్వు నిల్వలు పెరుగుతాయి. దీంతో వారు అనారోగ్యాల బారిన పడే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో కొవ్వును కరిగించుకునే మార్గాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతే సమస్యలు రావడం ఖాయం.

కొవ్వుతో..

అధికంగా పేరుకుపోయే కొవ్వుతో ప్రాణాలకే ప్రమాదం. కొవ్వు పట్టకుండా ఉండాలంటే మన ఆహార అలవాట్లను మార్చుకోవాలి. లేకపోతే కొవ్వు పెరిగితే రోగాలు చుట్టు ముట్టడం సహజమే. ఈ క్రమంలో కొవ్వును కరిగించే ఆహారాలు ఏమిటి? వాటిని ఎలా తీసుకోవాలి అనేదానిపై మనం శ్రద్ధ పెట్టాలి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును దూరం చేయడంలో పసుపు ఎంతో ఉపయోగపడుతుంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే మనం రోజు పసుపును ఆహారంలో ఉపయోగిస్తుంటాం.

పసుపుతో..

మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషించే పసుపును ఎలా ఉయోగించాలి? ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తే ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీరు పోసి పది నిమిషాలు మరిగించాలి. తరువాత అందులో ఒక అర టేబుల్ స్పూన్ పసుపు కలిపి గోరు వెచ్చగా అయ్యే వరకు మరిగించాలి. తరువాత అందులో తేనె కలిపి మధ్యాహ్న భోజనం తరువాత తాగాలి. పసుపును ఇలా తీసుకోవడం వల్ల కొవ్వును తగ్గించుకోవచ్చు.

బాదం పప్పుతో..

బాదం పప్పు కూడా కొవ్వును కరిగించడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, మోనో అన్ ప్యాురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్ సా్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అధికంగా ఉన్న కొవ్వును కరిగించడంలో ఉపకరిస్తాయి. రోజు నానబెట్టిన పది బాదం పప్పులను ఉదయం పొట్టు తీసి తినడం వల్ల కొవ్వు సులభంగా కరిగిపోతోంది. ఇంకా ఆరెంజ్ జ్యూస్ కూడా కొవ్వును తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి కొవ్వును కరిగించడంలో సాయపడుతుంది.

వెల్లుల్లితో..

వెల్లుల్లి కూడా కొవ్వును తగ్గించే ఔషధంగా పనిచేస్తుంది. రోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. రోజు ఒక వెల్లుల్లి రెబ్బను తిని గోరువెచ్చని నీటిని తాగితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. దీంతో రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అవిసె గింజలు కూడా కొవ్వును తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. రోజు ఒక టీ స్పూన్ అవిసె గింజలు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత అల్లంతో పాటు తీసుకుంటే మంచిది. అల్లం టీ తాగితే ఎంతో మేలు చేస్తుంది.

Tags