Relationship: మీ ప్రియమైన వారు మిమ్మల్ని మిస్ అవ్వాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు..

సోషల్ మీడియాలో మీకు సంబంధించిన విషయాలు ప్రతిసారీ పోస్ట్ చేయడం మంచిది కాదు. కానీ, అప్పుడప్పుడు ఇంపార్టెంట్ విషయాలను మాత్రం పోస్ట్ చేయడం వల్ల మీ గురించి వారికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. వీటిని చూసినప్పుడు మీరు ఏం చేస్తున్నారోనన్న క్యూరియాసిటి మిమ్మల్ని ఇష్టపడేవారిలో పెరుగుతుంది.

Written By: Swathi Chilukuri, Updated On : September 4, 2024 4:21 pm

Relationship

Follow us on

Relationship: ఒకరు మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే వారు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారని మీనింగ్. ఒకరు మీ విషయంలో అలా ఫీల్ అవ్వాలంటే చాలా స్పెషల్ హాబిట్స్ ఉండాలి. మనలో చాలా మంది ఎవరినైనా సీక్రెట్‌గా ఇష్టపడుతూనే వారి దృష్టిలో పడాలని, ఎక్కువగా తమ గురించే ఆలోచించాలని అనుకుంటారు. ఎవరిని అయినా సరే మరొకరు ఇష్టపడుతుంటే ఎవరికి నచ్చదు చెప్పండి. కానీ అలా ఇష్టపడటం అంత మామూలు విషయం కాదు కదా. అయితే చాలా అందంగా ఉన్నా, లేదంటే బెస్ట్ క్వాలిటీస్ ఉన్నా సరే కొందరు ఎక్కువగానే ఇష్టపడతారు. కొందరి దృష్టిలో పడటం చాలా కష్టం. అయినా సరే మిమ్మల్ని ఎవరైనా ప్రతి సారి మిస్ అయ్యేలా ఇష్టపడాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మరి అవేంటంటే..

సోషల్ మీడియాలో మీకు సంబంధించిన విషయాలు ప్రతిసారీ పోస్ట్ చేయడం మంచిది కాదు. కానీ, అప్పుడప్పుడు ఇంపార్టెంట్ విషయాలను మాత్రం పోస్ట్ చేయడం వల్ల మీ గురించి వారికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. వీటిని చూసినప్పుడు మీరు ఏం చేస్తున్నారోనన్న క్యూరియాసిటి మిమ్మల్ని ఇష్టపడేవారిలో పెరుగుతుంది. ఇలా చేయడం వర్కౌట్ అవుతుంది. అయితే కొన్ని సార్లు మీరు వారితో కలిసి మంచి ట్రిప్‌ ప్లాన్ చేసి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇద్దరు కూడా ట్రిప్ ను ప్లాన్ చేసుకొని మరీ ఎంజాయ్ చేయండి. ఆ జ్ఞాపకాలన్నీ మిమ్మల్ని బాగా మిస్ అయ్యేలా చేస్తాయి.

మీకు సంబంధించిన ఏదైనా వస్తువులని వారి దగ్గర మర్చిపోవడం చాలా ఉత్తమం. నోట్, బుక్స్, పెన్స్ ఇలా ఏవైనా సరే వారి దగ్గర కావాలనే మర్చిపోండి. వీటిని చూసినప్పుడల్లా వారు మిమ్మల్ని గుర్తుతెచ్చుకుంటారు దాన్ని చూసి ఫోన్ చేయడం వంటివి కూడా చేస్తుంటారు. ఎవరైనా ఏదైనా విషయం చెప్పి మధ్యలో ఆపిస్తే ఆ తర్వాత ఏం జరిగిందనే క్యూరియాసిటీ ఉంటుంది. మీరు కూడా ఇలానే వారికి ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసి.. చివరికీ ఏమైందో తర్వాత చెప్తాను అని ఆపేయండి. ఆ విషయం గురించి ఆలోచిస్తూనే మిమ్మల్ని మిస్ అవుతుంటారు మీ ప్రియమైన వారు.

పెర్ఫ్యూమ్‌ గురించి చాలా మంది ఆలోచించరు. కానీ, ఇది రిలేషన్‌షిప్‌లో కీ రోల్ పోషిస్తుంది పర్ఫ్మూమ్. మరీ ముఖ్యంగా మీకంటూ ఓ సిగ్నేచర్ సెంట్ లేదా పెర్ఫ్యూమ్ మెంటెయిన్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మీ చుట్టూ పక్కల ఉన్నవారిపై ఎఫెక్ట్ చూపిస్తుంది.అందుకే మీకంటూ ప్రత్యేకమైన ఒక సెంట్ ను వాడటం మర్చిపోవద్దు.

స్మైల్ ఎవరి లైఫ్ ను అయినా మార్చేస్తుంది. బెటర్ గా చేయాలన్నా, దారుణంగా మార్చాలన్నా ఈ స్మైల్ మంచి పాత్ర పోషిస్తుంది. మీ లైఫ్ లో ఉన్నవారిని మీరు వీలైనంత ఎక్కువ నవ్వించడానికి ట్రై చేయండి.ఇలా చేయడం వల్ల ఎప్పుడు మిమ్మల్ని వారు పక్కనే ఉండాలి అని కోరుకుంటారు. మీ దూరం వారికి నచ్చదు. అందుకే జోకులు వేస్తూనో లేదంటే మరేవిధంగా అయినా సరే నవ్వించడం మర్చిపోవద్దు.