https://oktelugu.com/

Vitamin D: మన శరీరానికి ఎంతసేపు ఎండలో నిలబడితే విటమిన్ D లభిస్తుందో తెలుసా ? నిపుణుల ఏమన్నారంటే ?

Vitamin D: cccccccccccccc. విటమిన్ డి ఇమ్యూనిటీ సిస్టమ్ ను బలంగా మార్చడంతో పాటు బ్యాక్టీరియా, వైరస్ ల నుంచి రక్షించడంలో ఉపయోగపడుతుంది.జలుబు లేదా ఫ్లూ సమస్యలు మిమ్మల్ని వేధిస్తుంటే విటమిన్ డి లోపం కూడా ఒక కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. సీజనల్ మార్పు శరీరంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయి. విటమిన్ డి లోపం కారణంగా వేధించే ఆరోగ్య సమస్యలలో టెన్షన్ ఒకటని చెప్పవచ్చు. సూర్యకాంతి మానసికస్థితిని మెరుగుపరచడంతో పాటు సెరోటోనిన్ అనే […]

Written By:
  • NARESH
  • , Updated On : April 25, 2022 / 11:56 AM IST
    Follow us on

    Vitamin D: cccccccccccccc. విటమిన్ డి ఇమ్యూనిటీ సిస్టమ్ ను బలంగా మార్చడంతో పాటు బ్యాక్టీరియా, వైరస్ ల నుంచి రక్షించడంలో ఉపయోగపడుతుంది.జలుబు లేదా ఫ్లూ సమస్యలు మిమ్మల్ని వేధిస్తుంటే విటమిన్ డి లోపం కూడా ఒక కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. సీజనల్ మార్పు శరీరంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయి. విటమిన్ డి లోపం కారణంగా వేధించే ఆరోగ్య సమస్యలలో టెన్షన్ ఒకటని చెప్పవచ్చు. సూర్యకాంతి మానసికస్థితిని మెరుగుపరచడంతో పాటు సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచడంలో ఉపయోగపడుతుంద

    Also Read: RRR Movie Special Story: ఆర్ఆర్ఆర్ మూవీ జర్నీ ఎలా మొదలైంది?

    సెరోటోనిన్ అనే హార్మోన్ సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుందని తెలుస్తోంది. విటమిన్ డి వల్ల ఎముకలు దృఢంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. విటమిన్ డి లేకపోతే శరీరానికి అవసరమైన స్థాయిలో కాల్షియం అందదు. వెన్ను లేదా కండరాలలో నొప్పి ఉన్నా కూడా విటమిన్ డి లక్షణం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. శరీరానికి అవసరమైన స్థాయిలో నిద్ర లేకపోయినా తగినంత ఆహారం తీసుకోకపోయినా అలసటగా అనిపించే అవకాశాలు ఉంటాయి.విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో శక్తిస్థాయిలు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కాల్షియం, ఐరన్, మెగ్నీషియంలను గ్రహించడంలో విటమిన్ డి ఉపయోగపడుతుంది. అవకాడో, చికెన్, వేరుశెనగలు, వెన్న తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు.

    Vitamin D: Finding

    ఎక్కువ విటమిన్-డి మనం సూర్యకిరణాల ద్వారా ఈజీగా పొందవచ్చు. ఇదే సులభమైన పద్ధతి. కాయకూరలు, పండ్లలో చాలా తక్కువ మోతాదులో ఇది ఉంటుంది.కాబట్టి ఉదయం, సాయంత్రం ఎండలో ఉంటే ఈ విటమిన్ డిని ఎక్కువగా మన శరీరం శోషించుకుంటుంది. అయితే ఎంత సేపు ఎండలో ఉంటే ఈ విటమిన్ డి మనకు పుష్కలంగా లభిస్తుందన్నది అందరికీ సందేహంగా ఉంటుంది.

    ఇది సూర్యుడి వేడిని బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా వేసవి కాలంలో అయితే 10 నుంచి 20 నిమిషాల పాటు ఉదయపు, సాయంత్రం ఎండలో ఉండాలి. 70 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్లకు విటమిన్ డి 600 IU ఉండాలి. అదే 70 ఏళ్లపైబడిన వారికి 800 IU ఉండేటట్టు చూసుకోవాలి. మీరు ఖచ్చితంగా 20 నిమిషాలు సూర్య కిరణాలు తగిలేలా ఉంటే అప్పుడు అవసరమైనంత విటమిన్ డి పుష్కలంగా పొందవచ్చని డాక్టర్స్ చెబుతున్నారు. మీ శరీరానికి అవసరమయ్యేంత విటమిన్ డీ ఇందులో అందుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

    Also Read: RRR Fans Dies In Accident: ముగ్గురి ప్రాణం తీసిన త్రిపుల్ ఆర్ బెన్ ఫిట్ షో.. రోడ్డు ప్ర‌మాదంలో దారుణం