https://oktelugu.com/

Health Tips : ఈ ఒక్క పండుతో సాయంత్రం వరకూ ఎనర్జిటిక్ గా ఉంటారు.. అదెంటో తెలుసా?

మార్కెట్ కు వెళ్లినప్పుడు ఎన్నో రకాల ఖర్జూరలు కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకోం. కానీ ఖర్జుర లో ఉండే పోషకాల గురించి తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. ఖర్జురలో విటమిన్ ఏ, బీ 6, విటమిన్ కె తో పాటు కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఉదయం విధులకు వెళ్లే ముందు టిఫిన్ కు బదులు ఖర్చురను తినడం వల్ల ఉత్సాహంగా ఉంటుంది

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 15, 2024 / 12:21 AM IST

    Daily Eat Date Fruit

    Follow us on

    Health Tips :  నేటి కాలంలో ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని కొందరు అభిప్రాయ పడుతుంటారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఎంత కష్టపడి డబ్బులు సంపాదించినా అనారోగ్యాల పాలైతే ఉన్నవన్నీ ఖర్చవుతుంటాయి. అందువల్ల ఉద్యోగం, వ్యాపారంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఒక భాగమేనంటున్నారు. ఇలాంటి తరుణంలో మనిషి ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రస్తుతం కాలంలో మనుషులు టైంతో పోటీ పడుతున్నారు. దీంతో ఆహారంపై శ్రద్ధ వహించడం లేదు. గంటల కొద్దీ విధుల్లో మునిగిపోవడంతో సమయం ఉండడం లేదు. దీంతో షార్ట్ కట్ ఫుడ్ అంటే జింక్ ఫుడ్ ను తీసుకుంటూ తక్షణ శక్తిని పొందుతున్నారు. కానీ ఇలా చేయడం వల్ల భవిష్యత్ లో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి వారు విటమిన్స్, ఐరన్ లభించే కొన్ని ప్రూట్స్ తీసుకోవడం మంచిదని కొందరి వైద్యుల సూచన. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఎటువంటి అనారోగ్యాలను దరి చేరకుండా కాపాడుతాయని వారి అభిప్రాయం. వీటిలో ఓ పండు తినడం వల్ల పురుషుల్లో ఎనర్జి అధికంగా వస్తుంది. దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా ఉంటారు. ఇందులో విటమిన్స్ తో పాటు ఐరన్ అధికంగా లభిస్తుంది. మరి ఆ పండు ఏదంటే?

    ఉద్యోగ విధులతో పాటు ఇంటి బాధ్యతలను మోసేవారు కూడా పురుషులే. దీంతో వీరు ఎప్పటికీ ఎనర్జీతో ఉండాలి. అప్పుడే అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. ఏ చిన్న నిర్లక్ష్యంగా ఉన్న మొదటికే మోసం అవుతుంది. ముఖ్యంగా పురుషులు రోజంతా విధుల కారణంగా ఎంత బిజీ ఉన్నా సాయంత్రం భాగస్వామితో సరదాగా ఉంటేనే పరిపూర్ణ జీవితం అంటారు. ఇందుకోసం ఎనర్జీతో ఉండాలి. ఎక్కువ శక్తి ఇచ్చే పండ్లను తీసుకోవాలి. చాలా మంది పురుషులు పండ్లు తినడానికి టైం కేటాయించరు. కానీ దీనిని రోజుకు ఒకటి తింటే చాలు నిత్యం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అదే ఖర్జుర.

    మార్కెట్ కు వెళ్లినప్పుడు ఎన్నో రకాల ఖర్జూరలు కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకోం. కానీ ఖర్జుర లో ఉండే పోషకాల గురించి తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. ఖర్జురలో విటమిన్ ఏ, బీ 6, విటమిన్ కె తో పాటు కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఉదయం విధులకు వెళ్లే ముందు టిఫిన్ కు బదులు ఖర్చురను తినడం వల్ల ఉత్సాహంగా ఉంటుంది. రోజంతా ఎంత ఒత్తిడి కలిగినా తట్టుకోగలుగుతారు.

    ఖర్జురను నేరుగా కాకుండా పాలతో మరిగించి ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు తినొచ్చు. అలాగే నానబెట్టిన ఖర్జురతో పాటు ఆ నీటిని తాగడం వల్ల శరీరం యాక్టివ్ అవుతుంది. ఖర్జురను ప్రతిరోజూ తినడం వల్ల శరీరం మాత్రమే కాకుండా మెదడులో ఉత్సాహం పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది అల్జీమర్స్ తో బాధపడుతున్నారు. ఇటువంటి వారికి ఖర్చుర బెస్ట్ ఫ్రూట్ అని అంటున్నారు. ఖర్జును తీసుకోవడం వల్ల సాయంత్రం ఇంటికి వచ్చినా అలసిపోరు.దీంతో కుటుంబంతోనూ ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా జీవిత భాగస్వామిని సంతోష పెట్టడానికి కావాల్సినంత ఎనర్జీ ఉంటుంది. అందువల్ల ప్రతీరోజూ ఒక ఖర్జురను తీసుకునే ప్రయత్నం చేయండి.