https://oktelugu.com/

Curd: పెరుగుతో ఇలా జ్యూస్ లు చేసుకోండి.. ఎండ దెబ్బ తగలదు..

లస్సీ.. లస్సీని తయారు చేయడం గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఇది చాలు సులభం. పెరుగును బాగా గిలక్కొట్టి నీరు తగినంత కలపాలి. ఈ నీటిలో కాస్త యాలకుల పొడి, కాస్త కుంకుమ పువ్వు, ఒక స్పూను పంచదార వేసి కలిపితే చాలు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 24, 2024 / 06:21 PM IST

    Curd

    Follow us on

    Curd: పెరుగులో క్యాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, ప్రోటీన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇక ఎండ తాపం నుంచి బయటపడటానికి ఈ పెరుగుతో చేసిన డ్రింక్స్ చాలా అవసరం. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అంతేకాదు పొట్ట ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది పెరుగు. మరి ఈ పెరుగుతో ఎలాంటి పానీయాలను తయారు చేసుకోవచ్చో ఓ సారి చూద్దాం.

    లస్సీ.. లస్సీని తయారు చేయడం గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఇది చాలు సులభం. పెరుగును బాగా గిలక్కొట్టి నీరు తగినంత కలపాలి. ఈ నీటిలో కాస్త యాలకుల పొడి, కాస్త కుంకుమ పువ్వు, ఒక స్పూను పంచదార వేసి కలిపితే చాలు. అంతే లస్సీ రెడీ అయినట్టే. మీకు కాస్త రుచి కావాలంటే మామిడి పండ్ల జ్యూస్ ను కూడా అందులో కలపవచ్చు. దీని వల్ల చాలా టేస్ట్ ఉంటుంది.

    పుదీనా మజ్జిగ.. మజ్జిగను చల్లగా తాగితే చాలు చాలా సూపర్ గా శరీరంలో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. పెరుగును బాగా గిలక్కొట్టి నీళ్లు వేసి కలిపితే చాలు మజ్జిగ లా అనిపిస్తుంది. అందులో అర స్పూన్ ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, పుదీనా తరుగు వేసి బాగా కలపాలి. దీన్ని తాగితే చాలు హాయిగా అనిపిస్తుంది.

    స్మూతీ.. పెరుగును ఒక కప్పులో వేసి అందులో తేనె లేదా బెల్లం తురుము వేసి బాగా కలపండి. తర్వాత సన్నగా తరిగిన బెర్రీ పండ్లు, పైనాపిల్, అరటి పండ్లు వేసి దాన్ని తింటే టేస్టీగా ఉంటుంది. ఈ మొత్తం మిశ్రమాన్ని బ్లెండర్ లో వేసి మెత్తగా స్మూతీగా మార్చుకొని తిన్నా కూడా రుచిగా ఉంటుంది.

    పుచ్చకాయ పెరుగు స్మూతీ.. పెరుగును ఒక కప్పులో వేసి, పుచ్చకాయను చేత్తోనే సన్నగా నలిపి పెరుగులో వేసి కలిపి చియా గింజలను చల్లండి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టండి. కాస్త చల్లగా అయిన తర్వాత తీసుకొని తినండి. ఈ స్మూతీ మీకు చాలా నచ్చుతుంది.

    పెరుగు బనానా షేక్.. బాగా పండిన అరటి పండును ఒక బౌల్ లో వేసి పెరుగు కలపాలి. అందులో అరటిపండు గుజ్జును వేసి కలపాలి. తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలిపి పైన వెనిల్లా ఐస్ క్రీమ్ ను ఒక స్కూప్ వేయండి. అంతే మీకు కావాల్సిన బనానా షేక్ రెడీ అయినట్టే. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది. ఇలాంటి పానీయాల వల్ల మీకు వేసవి తాపం తగ్గుతుంది. అంతేకాదు వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు.