Cracked heels : మీ కాళి మడిమలు పగిలాయా? అబ్బో ఈ చలికాలం వస్తే ఇదొక పెద్ద సమస్య. పెదవులు, మొహం, స్కిన్, చేతులు, కాల్లు పగులుతూనే ఉంటాయి. చూడ్డానికీ ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది పక్కన పెడితే నొప్పి, రక్తం కారడం వంటి సమస్యలు కూడా ఉంటాయండి బాబు. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి కాబట్టి వెంటనే వచ్చే చర్మ సమస్యల్లో కాలి పగుల్ళు ముందు వరుసలో ఉంటాయి. ఈ సమస్యతో బాధ పడుతుంటే మాత్రం కచ్చితంగా కొన్ని టిప్స్ పాటించాలి. ఎక్స్‌ఫోలియేషన్, మాయిశ్చర్, మసాజ్ వంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేయాలి. అందులో పాదాలను 5 నుంచి 10 నిమిషాలు అలాగే పెట్టి రిలాక్స్ తీసుకోవాలి. వారానికి ఓ సారైనా ఇలా చేస్తే మీ కాళి పగుళ్ల సమస్య నయం అవుతుంది. పాదాలకి మసాజ్ చేస్తే కూడా సర్క్యూలేషన్‌ని ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా నొప్పిని తగ్గుతుంది. దీంతో పాదాల పగుళ్ళు తగ్గే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్, టీట్రీ ఆయిల్స్ వంటివి పాదాలకు పెట్టి మసాజ్ చేయాలి. దీని వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.
నిద్ర పోయే ముందే పాదాలకు సాక్సులు వేసుకొని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు రాసిన క్రీమ్స్, లోషన్స్, ఆయిల్స్, చర్మంలోకి అబ్జార్బ్ అవుతాయి అంటున్నారు నిపుణులు. పాలమీగడలో కొద్దిగా పసుపు కలిపి రాస్తే పగిలిన పాదాలు మృదువుగా మారుతాయి. అంతేకాదు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. పసుపు యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుందనే విషయం తెలిసిందే. సో ఈ పుసుపులో కాస్త అలోవెరా జెల్ వేసి పాదాలకు రాయాలి. దీని వల్ల మంచి మాయిశ్చర్‌గా అందుతుంది. వాపు సమస్య ఉన్నా కూడా పోతుంది. ఇలా చేయడం వల్ల మడమల పగుళ్లు రాకుండా ఉంటాయి.
ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్ లేదా పెట్రోలియమ్ జెల్లీని పాదాలకి రాసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది. దీనికోసం గ్లిజరిన్, రోజ్‌వాటర్, పాలు, తేనె, అవకాడో, ఓట్ మీట్, జొజొబా ఆయిల్ వంటి పదార్థాలను ఉపయోగించవచ్చు. వీటి వల్ల పాదాలకి తేమ అందుతుంది. నిమ్మరసం, గ్లిజరిన్‌ని మిక్స్ చేసి మడమలకు రాసుకున్నా సరే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మిశ్రమం వల్ల పాదాలు హైడ్రేట్‌గా ఉంటాయి. విటమిన్ ఇ ఆయిల్ రాయడం వల్ల కూడా పాదాలు హైడ్రేట్‌గా ఉంటాయి అంటున్నారు నిపుణులు.
పాదాలను గోరువెచ్చని నీటిలో 10 నుంచి 20 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత ప్యూమిస్ స్టోన్, ఫుట్ స్క్రబ్బర్, లూఫా.. వంటి వాటిని తీసుకుని రబ్ చేయాలి. దీంతో డెడ్ స్కిన్ మొత్తం దూరం అవుతుంది. అంతేకాదు తేనె, చక్కెరని కలిపి స్క్రబ్‌లా వాడినా మంచి ఫలితం ఉంటుంది. పాదాలు కూడా మృదువుగా మారతాయి.