లాన్సెట్ జర్నల్‌లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. చైనా నేషనల్ సెంటర్ ఫర్ రెస్పిరేటరీ మెడిసిన్ పరిశోధకులు 1733 మంది కరోనా రోగులపై అధ్యయనం చేసి మూడింట ఒక వంతు రోగులు 12 నెలలు శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారని తేల్చారు. కరోనా సోకిన వాళ్లు సోకని వాళ్లతో పోలిస్తే తక్కువ ఆరోగ్యంగా ఉన్నారని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
కరోనా రోగులలో కొంతమంది సంవత్సరం తర్వాత సీటీ స్కాన్ చేయించుకోగా కొంతమంది రోగులు ఏడాది తర్వాత కూడా పూర్తిస్థాయిలో కోలుకోలేదని వెల్లడైంది. కండరాల బలహీనత కేసులు, అలసటకు సంబంధించిన కేసులు పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ఏవైనా లక్షణాలు కనిపిస్తే పోషకాహారంపై దృష్టి పెట్టాలి. అనారోగ్యాన్ని కలిగించే ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. శ్వాస సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిది.