Chilli Powder: కారంతో చేసిన వంటకాలు ఎక్కువగా తింటున్నారా.. అలాంటి సమస్యలు వస్తాయట?

Chilli Powder: మనలో చాలామంది కారంతో చేసిన వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే కారంతో చేసిన వంటకాలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కారంతో చేసిన వంటకాలను ఎక్కువగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. శరీరానికి కారం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కలిగి ఉంటే మంచిది. ఎవరైతే ఎర్ర మిరపకాయలతో చేసిన వంటకాలను ఎక్కువగా తింటారో వాళ్లను ఆస్తమా వేధించే […]

Written By: Navya, Updated On : March 15, 2022 3:55 pm
Follow us on

Chilli Powder: మనలో చాలామంది కారంతో చేసిన వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే కారంతో చేసిన వంటకాలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కారంతో చేసిన వంటకాలను ఎక్కువగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. శరీరానికి కారం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కలిగి ఉంటే మంచిది.

Chilli Powder

ఎవరైతే ఎర్ర మిరపకాయలతో చేసిన వంటకాలను ఎక్కువగా తింటారో వాళ్లను ఆస్తమా వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కారంతో చేసిన వంటకాలను ఎక్కువగా తినడం వల్ల కడుపులో పుండ్లు ఏర్పడే అవకాశంతో పాటు అల్సర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. గర్భంతో ఉన్న మహిళలు కారంతో చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకుంటే శిశువుకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

Also Read: KCR Vs BJP: వెంటపడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలను వేటాడుతున్న కేసీఆర్!

కారంపొడితో చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటిపూత, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కారంపొడితో చేసిన వంటకాల వల్ల కొంతమందిని గ్యాస్ సమస్యలు వేధించే అవకాశం ఉండగా మరి కొందరిని జీర్ణ సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కారంతో చేసిన వంటకాలు ఎక్కువగా తింటే మూర్ఛ, మైకము, బలహీనత సమస్యలు వస్తాయి.

కారంతో చేసిన వంటకాలను తరచూ తీసుకునే వాళ్లను అసిడిటీ సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు కారంతో చేసిన వంటకాలను పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. కారం మితంగా తీసుకుంటే మాత్రమే ఆరోగ్యానికి మంచిదని అమితంగా తీసుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Prabhas Radhe Shyam Movie Box Office Collection: ప్చ్.. ‘రాధేశ్యామ్’ పరిస్థితి మరీ ఇంత దారుణమా ?