Walking tips for Better Health: ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు వ్యాయామం చేయడం తప్పనిసరిగా మారింది. అయితే కొందరు క్రమ పద్ధతిలో ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. మరికొందరు మాత్రం కొన్ని పనుల కారణంగా వ్యాయామం చేయలేకపోతున్నారు. అయితే వ్యాయామం చేసిన వారైనా సాధారణంగా వ్యాయామం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండవని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో కొన్ని సూత్రాలు పాటించడం ద్వారా తొందరగా బరువు తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నా. వీటిలో బ్రిస్క్ వ్యాయామం చేయడం ద్వారా మరిన్ని ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అసలు బ్రిస్క్ వ్యాయామం అంటే ఏమిటి? దీనిని ఎలా చేయాలి?
వాతావరణ కాలుష్యం, ఆహార నాణ్యత లోపించడంతో చాలామంది అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో బరువు పెరగడం ఇబ్బందిగా మారింది. కొంతమంది బరువు తగ్గడానికి అనేక రకాల మెడిసిన్స్ వాడుతున్నారు. మరికొందరు డైట్ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారు. అయినా కూడా అనుకున్న ఫలితాలు ఉండడం లేదు. అయితే ఎలాంటి ఆరోగ్య నియమాలు పాటించిన వ్యాయామం తప్పనిసరి అని కొందరు వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయడానికి ద్వారా ఎంతో కొంత ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే సాధారణ వ్యాయామం కాకుండా ప్రత్యేకమైన పద్ధతిలో వ్యాయామం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు.
బరువు తగ్గేందుకు ప్రతిరోజు నడక తప్పనిసరిగా మారింది. వ్యాయామంలో బాగా వాకింగ్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే కొందరు మెల్లిగా వాకింగ్ చేస్తారు.. మరికొందరు స్పీడ్ వాకింగ్ చేస్తారు. కానీ బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. బ్రిస్క్ వాకింగ్ అంటే సాధారణంగా నడవడం కంటే చేతులను అటు ఇటు ఊపుతూ.. ఇతరులతో మాట్లాడుతూ.. ఉల్లాసంగా ముందుకు నడుస్తూ ఉండాలి. ఇలా నడవడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా గుండెకు మేలు జరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా మారుతారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
Also Read: వేడి వేడి టిఫిన్స్.. కర్రీస్.. కవర్లలో? అయితే.. మీరు ప్రమాదంలో ఉన్నట్టే!
ఇదే బ్రిస్క్ వ్యాయామమును సాయంత్రం చేయడం వల్ల కూడా ఫలితాలు ఉండలు ఉన్నాయి. సాయంత్రం కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ఇలాంటి వ్యాయామం చేయడం వల్ల నాణ్యమైన నిద్రను పొందగలుగుతారు. అనుకున్న దానికంటే త్వరగానే బరువు తగ్గగలుగుతారు. అయితే ఏ రకమైన వ్యాయామం చేసిన ఆహార విషయంలో నియమాలు పాటించుకోవాలి. క్రమ పద్ధతిలో ఆహారం తీసుకున్నప్పుడే బరువు కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల అనుకున్న ఫలితాలే ఉంటాయి.
ఇవే కాకుండా కొందరు బరువు తగ్గడానికి డైట్ మెయింటెయిన్ చేస్తారు. అయితే ఇందులో ఎక్కువ ప్రోటీన్లు కలిగినవి ఉంటే ఎంతో మంచిది. డైట్ పేరు చెప్పి ఆహారాన్ని తీసుకోవడం మానివేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకుంటూ బరువు తగ్గేందుకు వాకింగ్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రత్యేకంగా వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు.