https://oktelugu.com/

Cinnamon Powder: ఈ పౌడర్‌తో మధుమేహానికి చెక్ పెట్టండిలా!

మధుమేహాన్ని నియంత్రించడానికి మందులు వాడుతూ, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకున్న సమస్య తగ్గడంలేదు. ఇలాంటి సమయాల్లో సహజ చిట్కాలను పాటిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. వంటింట్లో దొరికే ఈ పదార్థంతో పౌడర్ చేసుకుంటే మధుమేహానికి ఈజీగా చెక్ పెట్టవచ్చు. మరి ఆ పౌడర్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 13, 2024 / 05:03 PM IST

    Cinnamon powder

    Follow us on

    Cinnamon Powder: జీవన శైలిలో మార్పులు, ఆహార అలవాట్లు వల్ల చాలా మంది ఈరోజుల్లో మధుమేహం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయి. దీనిని తగ్గించుకోవడానికి వైద్యుల సూచనల మేరకు మందులు వాడటంతో పాటు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఇంట్లో తినడం కంటే బయట ఎక్కువగా తింటున్నారు. వీటిలో రసాయనాలు కలపడం, ఫ్రిడ్జ్‌లో స్టా్క్ ఉంచడం వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి ఫుడ్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ ఫుడ్స్‌ వల్ల శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. దీంతో సమస్య తీవ్రం అవుతుంది. అయితే మధుమేహాన్ని నియంత్రించడానికి మందులు వాడుతూ, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకున్న సమస్య తగ్గడంలేదా. ఇలాంటి సమయాల్లో సహజ చిట్కాలను పాటిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. వంటింట్లో దొరికే ఈ పదార్థంతో పౌడర్ చేసుకుంటే మధుమేహానికి ఈజీగా చెక్ పెట్టవచ్చు. మరి ఆ పౌడర్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

     

    వంటింట్లో దొరికే దాల్చిన చెక్క పౌడర్‌‌తో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. రోజూ రాత్రి నిద్రపోయే ముందు గ్లాసు పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. ఈ పాలను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. పాలలో ఇలా తాగలేమని అనుకునేవారు ఆహారంలో తీసుకోవచ్చు. దీనిని ఎక్కువగా బిర్యానీ, మసాల్లో ఉపయోగిస్తారు. కొందరు టీలో కూడా వేసుకుని తాగుతారు. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగడానికి టేస్టీగా ఉండటంతో పాటు మధుమేహం సమస్య కూడా తగ్గుతుంది. దాల్చిన చెక్కను ఏ విధంగా తీసుకున్న కూడా డయాబెటిక్ రోగులకు చక్కగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క నీరు తాగిన కూడా శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తొందరగా బరువు తగ్గుతారు. గ్లాసు నీటిలో రాత్రిపూట దాల్చిన చెక్క ఉంచి పొద్దున్నే ఆ నీరు తాగితే బరువు తగ్గుతారు.

     

    దాల్చిన చెక్కలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా బాగా ఉపయోగపడతాయి. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయం చేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఉండే మంటను తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో మంటను తగ్గించడంతో పాటు అజీర్ణం, అసౌకర్యం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులోని థర్మోజెనిక్ లక్షణాలు శరీరంలో మెటబాలిక్ రేటుని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. ఏదో విధంగా దాల్చిన చెక్కను డైలీ డైట్‌లో చేర్చుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.