ఆ వ్యాక్సిన్ తో వృద్ధుల్లో కరోనా వైరస్ కు చెక్..?

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి సాధారణ వ్యక్తులతో పోలిస్తే వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా బారిన పడి చనిపోతున్న వాళ్లలో 65 ఏళ్లకు పై బడిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోయినా ఒక వ్యాక్సిన్ వృద్ధులపై అద్భుతంగా పని చేస్తోందని తెలుస్తోంది. బీసీజీ వ్యాక్సిన్ సహాయంతో కరోనాకు చెక్ పెట్టడం సులభమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. […]

Written By: Kusuma Aggunna, Updated On : October 30, 2020 9:41 am
Follow us on


ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి సాధారణ వ్యక్తులతో పోలిస్తే వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా బారిన పడి చనిపోతున్న వాళ్లలో 65 ఏళ్లకు పై బడిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోయినా ఒక వ్యాక్సిన్ వృద్ధులపై అద్భుతంగా పని చేస్తోందని తెలుస్తోంది.

బీసీజీ వ్యాక్సిన్ సహాయంతో కరోనాకు చెక్ పెట్టడం సులభమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీసీజీ వ్యాక్సిన్ వృద్ధుల్లో యాంటీబాడీల ఉత్పత్తిని పెంచడంలో మెమొరీ సెల్ ప్రతిస్పందనలను పెంచడంలో సహాయపడుతుంది. 86 మంది వృద్ధులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. 86 మంది వృద్ధులలో 54 మంది వృద్ధులకు బీసీజీ వ్యాక్సిన్ ను ఇచ్చిన శాస్త్రవేత్తలు మిగిలిన వాళ్లకు మాత్రం వ్యాక్సిన్ ఇవ్వలేదు.

బీసీజీ వ్యాక్సిన్ తీసుకున్న వారిని 30 రోజుల తర్వాత పరిశీలించగా కరోనాకు వ్యతిరేకంగా వాళ్లలో రోగనిరోధక శక్తి పెరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. బీసీజీ వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుల్లో కరోనాకు వ్యతిరేకంగా వైరస్ ను తట్టుకోగలిగే సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐసీఎంఆర్ సీనియర్ ఎపిడిమియాలజిస్ట్, చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సమిరన్ పండా ఈ ప్రయోగం వృద్ధులను కాపాడటంలో మంచి ఫలితాలను ఇస్తోందని తెలుపుతున్నారు.

గతంలో కూడా అనేక ప్రయోగాలు కరోనా వ్యాక్సిన్ వృద్ధులపై సమర్థవంతంగా పని చేస్తున్నట్టు తేల్చిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ ను కనుగొనే దిశగా ప్రయోగాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు.