https://oktelugu.com/

24 గంటల్లో కరోనా వైరస్ కు చెక్.. వెలుగులోకి కొత్త ఔషధం..?

ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి విషయంలో శాస్త్రవేత్తలు వరుస శుభవార్తలు చెబుతున్నారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమేనని ప్రూవ్ చేస్తున్నారు. అమెరికా శాస్త్రవేత్తలు ఒక ఔషధం సహాయంతో కరోనా వైరస్ కు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. అమెరికాలోని జార్జియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో మోల్నుపిరావిర్ అనే యాంటీ వైరల్ ఔషధం కరోనాకు సులువుగా చెక్ పెడుతున్నట్టు తేలింది. ఇన్ ఫ్లూయెంజా వైరస్ లకు చెక్ పెట్టేందుకు తయారు చేసిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 5, 2020 / 06:59 PM IST
    Follow us on

    ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి విషయంలో శాస్త్రవేత్తలు వరుస శుభవార్తలు చెబుతున్నారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమేనని ప్రూవ్ చేస్తున్నారు. అమెరికా శాస్త్రవేత్తలు ఒక ఔషధం సహాయంతో కరోనా వైరస్ కు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. అమెరికాలోని జార్జియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో మోల్నుపిరావిర్ అనే యాంటీ వైరల్ ఔషధం కరోనాకు సులువుగా చెక్ పెడుతున్నట్టు తేలింది.

    ఇన్ ఫ్లూయెంజా వైరస్ లకు చెక్ పెట్టేందుకు తయారు చేసిన ఈ ఔషధం కరోనాను ఎదుర్కోవడంతో సమర్థవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కరోజులో ఈ యాంటీ వైరల్ ఔషధం శరీరంలోని కరోనా వైరల్ రేణువులను గణనీయంగా తగ్గిస్తుందని ఫలితంగా వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా సులభంగా అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. శాస్త్రవేత్తలు జంతువులపై చేసిన ప్రయోగాల్లో వైరల్ రేణువులు గణనీయంగా తగ్గాయని సమాచారం.

    కరోనా కట్టడికి ఇదే సరైన మందు అని.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలోపు ఈ ఔషధం ద్వారా వైరస్ కు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫెర్రెట్ అనే జంతువులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.. ఈ ఔషధం తీసుకున్న జంతువులకు వైరస్ సోకలేదని మిగిలిన జంతువులకు మాత్రం వైరస్ సోకిందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. మనుషులకు ఈ డ్రగ్ ఇస్తే 24 గంటల్లోనే వైరస్ కు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

    ఈ ఔషధం ద్వారా కరోనాకు వేగంగా చెక్ పెట్టవచ్చని.. నోటి ద్వారా ఈ ఔషధాన్ని తీసుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ ఔషధం సహాయంతో కరోనాకు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.