ఎంఐఎంతో పొత్తుపై కేసీఆర్ వ్యూహాత్మక మౌనం!

కర్ర విరగకుండా పాము( బీజేపీ)ని చంపాలి.. ఎలా చంపాలి.. జీహెచ్ఎంసీలో మెాజార్టీ సీట్లు సాధించని గులాబీ పార్టీ అధినేత ఇప్పుడు మేయర్ పీఠం చేజారకుండా అదే సమయంలో బీజేపీకి అస్త్రంగా మారకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బోల్తా పడిన తర్వాత కేసీఆర్ సైలెంట్ అయ్యారు . మేయర్ పీఠం సాధించేటన్నీ సీట్లు రాకపోవడంతో ఇప్పుడు ఎంఐఎంతో కలిసి వెళ్లాలా? లేదా ఒంటరిగా వెళ్లాలా అనే దానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది.. ఈ క్రమంలోనే టీఆర్ఎస్-ఎంఐఎం […]

Written By: NARESH, Updated On : December 5, 2020 7:42 pm
Follow us on

కర్ర విరగకుండా పాము( బీజేపీ)ని చంపాలి.. ఎలా చంపాలి.. జీహెచ్ఎంసీలో మెాజార్టీ సీట్లు సాధించని గులాబీ పార్టీ అధినేత ఇప్పుడు మేయర్ పీఠం చేజారకుండా అదే సమయంలో బీజేపీకి అస్త్రంగా మారకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బోల్తా పడిన తర్వాత కేసీఆర్ సైలెంట్ అయ్యారు . మేయర్ పీఠం సాధించేటన్నీ సీట్లు రాకపోవడంతో ఇప్పుడు ఎంఐఎంతో కలిసి వెళ్లాలా? లేదా ఒంటరిగా వెళ్లాలా అనే దానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది.. ఈ క్రమంలోనే టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.

Also Read: కాంగ్రెస్ పై మరోసారి సంచలన కామెంట్స్ చేసిన ‘కొండా’..!

మేయర్ పీఠంపై తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్ చేశారు.. ఫలితాల అనంతరం ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ తమను సంప్రదించలేదని అన్నారు. టీఆర్ఎస్ కు మద్దతుపై తమ పార్టీలో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని అసద్ తెలిపారు. టీఆర్ఎస్ కు గ్రేటర్ లో ఓట్లు ఎందుకు తగ్గాయో ఆ పార్టీనే అడగాలని అసద్ ఎదురు ప్రశ్నించారు. గ్రేటర్ లో తమకు దక్కిన సీట్ల పట్ల సంతృప్తిగా ఉన్నామని.. తమను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీడీపీ, వైసీపీ, వామపక్షాలు, ఇతర పార్టీలు ఉనికి కోల్పోవడంతో వాటి స్థానాన్ని బీజేపీ ఆక్రమించిందన్నారు.

ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 డివిజన్లతోపాటు ఎక్స్ అఫీషియో కలుపుకుంటే మేజిక్ మార్క్ 102గా ఉంది. కానీ టీఆర్ఎస్ సంఖ్యా బలం 92 మాత్రమే. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో పార్టీ మద్దతు అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్నది వేచిచూడాలి.

Also Read: బిజెపి గెలుపుపై కవిత వింత వాదన

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడడంతో మేయర్ పీఠం ఎవరికి దక్కనుందనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ఈ పార్టీ చేరుకోలేకపోయింది. దీంతో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటారా? లేదా అన్నది కేసీఆర్ నిర్ణయమే ఇక్కడ ఫైనల్ కానుంది. ఎంఐఎం కలిస్తే బీజేపీ టార్గెట్ చేసే అవకాశాలు ఉండడంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఉత్కంఠగా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్