Chanakya Niti: ఆచార్య చాణుక్యుడు మంచి వ్యూహకర్త, ఆర్థికవేత్త అనే విషయం తెలిసిందే. చాణుక్యుడు తన పుస్తకాల ద్వారా నిజ జీవితంలో ఏ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలో వెల్లడించారు. చాణక్య నీతి పేరుతో చాణుక్యుడు రచించిన నీతిశాస్త్రంలో చాణుక్యుడు ఎన్నో అంశాలను ప్రస్తావించారు. భార్యా పిల్లల ముందు తప్పనిసరిగా కొన్ని విషయాల గురించి మాట్లాడకూడదని చాణుక్యుడు సూచనలు చేశారు.
Chanakya Niti
చాణుక్యుడు చెప్పిన విషయాల ప్రకారం భర్త భార్యతో ఎల్లప్పుడూ ప్రేమగా మాట్లాడాలి. కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషంతో కూడిన వాతావరణం ఉండాలి. ఇంట్లో భార్య లేదా పిల్లలపై కోపంతో వ్యవహరించడం సరి కాదు. ప్రేమతో మాట్లాడటం ద్వారా మాత్రమే మంచి ఫలితాలను సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. భార్యను కొట్టడం, దుర్భాషలాడటం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.
Also Read: RRR Movie Box Office Collection Worldwide: అఫీషియల్ : ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలివే
భార్య లక్ష్మీస్వరూపం కాబట్టి భార్యపై ఎల్లప్పుడూ ప్రేమతో వ్యవహరించాలి. భార్యను తిడుతూ కొడుతూ వ్యవహరిస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని చాణుక్యుడు వెల్లడించారు. భార్య లేదా పిల్లల ముందు అసభ్యకరమైన పదాలను, అభ్యంతర పదాలను వాడటం మంచిది కాదు. తండ్రి పిల్లల ముందు ఏ విధంగా ప్రవర్తిస్తాడో పిల్లలు కూడా ఇతరుల ముందు అదే విధంగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి.
తండ్రి భార్యాపిల్లల దగ్గర ఏదైనా మాట్లాడే సమయంలో ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిది. సమాజంలో జరుగుతున్న ఘటనలపై లోతైన అవగాహన ఉన్న చాణుక్యుడు గౌరవప్రదంగా జీవనం సాగించడం గురించి ఈ సూచనలు చేయడం గమనార్హం.
Also Read: RRR Movie: చంద్రబాబు ఇలాకాలో ఆర్ఆర్ఆర్ లొల్లి.. ఘర్షణ