Chanakya Neethi: ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరిగా విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తాడు. సమాజంలో సక్సెస్ కు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. సక్సెస్ లో ఉన్నవాళ్లకు సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది. కొంతమంది కెరీర్ లో సులువుగానే సక్సెస్ సాధిస్తే మరి కొందరు ఎంత ప్రయత్నించినా విజయాన్ని సొంతం చేసుకోలేరు. అయితే చాణుక్యుడు జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలనే విషయాలను నీతిశాస్త్రం ద్వారా వెల్లడించారు.
లైఫ్ లో విజయం సాధించాలని అనుకుంటే మొదట సోమరితనాన్ని వీడి శ్రమించాలి. మనం నిత్యం చేసే పనులను వాయిదా వేయడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోవడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి. సోమరితనం వల్ల సక్సెస్ సాధించడం సాధ్యం కాదని శ్రమిస్తే మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. సోమరితనం మనకు అతిపెద్ద శత్రువు అని భావించాలి.
జీవితంలో ఓటమికి భయపడుతూ ముందడుగులు వేస్తే కూడా నిత్య జీవితంలో ఇబ్బందులు తప్పవని గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు ఓడిపోయినా తర్వాత రోజుల్లో మంచి ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని గుర్తుంచుకోవాలి. సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిత్యం శ్రమించడం ద్వారా సులభంగా గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. విజయం సాధించాలంటే క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు.
ఎవరైతే క్రమశిక్షణతో సక్సెస్ కోసం ప్రయత్నిస్తారో వాళ్లు ప్రతి నిమిషంను సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటారు. సమయం వృథా చేయడం వల్ల కెరీర్ విషయంలో నష్టపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సక్సెస్ సాధించడానికి ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలి. అధర్మ మార్గంలో సక్సెస్ కోసం ప్రయత్నిస్తే మాత్రం నష్టం తప్ప లాభం ఉండదని గుర్తుంచుకోవాలి. ఈ విషయాలను గుర్తుంచుకుంటే జీవితంలో తప్పనిసరిగా సక్సెస్ సొంతమవుతుంది.