Cancer Screening: కోత కోయకుండానే కనిపెట్టొచ్చు: క్యాన్సర్ నిర్ధారణ ఇప్పుడు మరింత ఈజీ

Cancer Screening: రోజురోజుకు కాలుష్యం ఎక్కువవుతోంది. దీనికి తోడు మనిషి ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఫలితంగానే కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మరి ముఖ్యంగా కొత్త కొత్త క్యాన్సర్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వైద్య రంగానికి పెను సవాళ్లు విసురుతున్నాయి. అయితే నిన్న మొన్నటివరకు క్యాన్సర్ అంటే కొంతమందిలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. కేవలం క్యాన్సర్ వల్లే ప్రపంచ వ్యాప్తంగా వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధిని […]

Written By: K.R, Updated On : August 26, 2022 6:30 pm
Follow us on

Cancer Screening: రోజురోజుకు కాలుష్యం ఎక్కువవుతోంది. దీనికి తోడు మనిషి ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఫలితంగానే కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మరి ముఖ్యంగా కొత్త కొత్త క్యాన్సర్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వైద్య రంగానికి పెను సవాళ్లు విసురుతున్నాయి. అయితే నిన్న మొన్నటివరకు క్యాన్సర్ అంటే కొంతమందిలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. కేవలం క్యాన్సర్ వల్లే ప్రపంచ వ్యాప్తంగా వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధిని గనుక ముందే గుర్తిస్తే రోగి ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే ఈ వ్యాధిని పూర్తిగా అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. శరీరంలోని ఏ కణం వల్ల ఏ రకమైన క్యాన్సర్ వస్తుందో తెలుసుకుంటే, వ్యాధిని మొదట్లోనే నయం చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. వైద్యరంగం ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటివరకు వరకు కూడా క్యాన్సర్ నిర్ధారణకు పెట్ స్కాన్ ఒకటే మార్గం. దీనివల్ల తీవ్రమైన రేడియేషన్ ప్రభావానికి రోగి గురవుతాడు. ఫలితంగా రకరకాల దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఇలాంటి తరుణంలో మానవాళికి శుభసంకేతంగా బ్రిటన్ శాస్త్రవేత్తలు ఒక వినూత్న ప్రయోగం చేశారు. దానివల్ల క్యాన్సర్ ను నిర్ధారించడం ఇక ఈజీ అని చెప్తున్నారు. ఇంతకీ ఆ విధానం ఏంటంటే?

Cancer Screening

ప్రోస్టేట్ గ్రంధి అడ్డుకోత

క్యాన్సర్ ను నివారించాలంటే ముందుగా నిర్ధారించాలి. అయితే ఈ మేరకు ప్రోస్టేట్ గ్రంధి మొత్తానికి సంబంధించి పూర్తి మ్యాపు రూపొందించారు. క్యాన్సర్ కణాలతో పాటు సాధారణ కణాలు కూడా ఇందులో ఉన్నాయి. బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేటిహెచ్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ ఫర్ లైఫ్ లాబరేటరీ, స్వీడన్ లోని కర్లోనిస్కా ఇన్నిస్టిట్యూట్లకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా గత కొద్ది రోజులుగా అధ్యయనాలు చేపడుతున్నారు.

Also Read: Viral: ముక్కులో 150 గుడ్లు పెట్టి ఈగలు.. అతి కష్టం మీద తొలగించిన వైద్యులు

క్యాన్సర్ సోకిన గ్రంధి కణాల్లో పలు జన్యుపరమైన ఉత్పరివర్తనాలు జరిగాయని తెలుసుకున్నారు. ఈ జన్యుపరమైన ఉత్పరివర్తనాల గురించి తెలుసుకొనేందుకు ప్రోస్టేట్ కణజాలానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా”స్పెషియల్ ట్రాన్స్ క్రిప్టో మిక్స్” అనే సాంకేతిక విధానాన్ని ఉపయోగించారు. వైద్య పరిభాషలో ఈ సాంకేతిక విధానం ఇంతవరకు ఎప్పుడు కూడా ఉపయోగించలేదు. సాధారణంగా క్యాన్సర్ సోకినప్పుడు వ్యాధి నిర్ధారణ చేసేందుకు సంబంధిత కణజాలాన్ని సేకరించాల్సి వచ్చేది. ఆ తర్వాతే క్యాన్సర్ కణాల జన్యువులను అధ్యయనం చేసేందుకు వీలుండేది. అయితే “స్పెషియల్ ట్రాన్స్ క్రిప్టో మిక్స్” విధానం ద్వారా నేరుగా కణజాలాన్ని సేకరించాల్సిన అవసరం ఉండదు. శాస్త్రవేత్తలు ప్రోస్టేట్ మ్యాప్ లో ఒకే రకమైన జన్యువులు ఉన్న కణాలను ఒకే గ్రూపుగా వేరు చేశారు. సుమారు 1.5 లక్షల ప్రాంతాల్లోని ప్రోస్టేట్, రొమ్ము, క్యాన్సర్, చర్మ క్యాన్సర్, లింప్ క్యాన్సర్, మెదడు కణాలన్నింటినీ విశ్లేషించి ఒక ఆల్గారిథం అభివృద్ధి చేశారు. ఈ ఆగారిథం మ్యాప్ ఆధారంగా క్యాన్సర్ ను ముందుగా గుర్తించి, వ్యాధి తీవ్రత ముదరక ముందే చికిత్స అందించే వీలు ఉంటుందని చెప్తున్నారు.

Cancer Screening

మనదేశంలో ఏటా 30 వేల మంది..

వివిధ రకాల క్యాన్సర్లతో మన దేశంలో ఏటా 30 వేల మంది కన్నుమూస్తున్నారు. ఇటీవల లివర్, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే వీటిల్లో సుమారు 30 శాతం మంది వరకు యువతి యువకులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య శాఖ ఇటీవల తెలిపిన గణాంకాల ప్రకారం తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో లంగ్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. యువత మద్యపానం, ధూమపానం ఎక్కువగా చేస్తుండటం, కాలుష్యం పెరిగిపోవడం వంటివి క్యాన్సర్ కు దారితీస్తున్నాయి. కొన్ని కేసులు అయితే వంశపారంపర్యంగా వస్తున్నాయి. అయితే తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు రూపొందించిన మ్యాప్ ఆధారంగా క్యాన్సర్ నూ కనుక ముందుగా నిర్ధారిస్తే త్వరగా నయం చేసే అవకాశాలుంటాయి. ప్రస్తుతం ప్రయోగాల దశలోనే ఉన్న ఈ విధానం విజయవంతం అయితే గనుక క్యాన్సర్ నివారణ సులభం అయ్యే అవకాశాలు ఉంటాయి.

Also Read:Special Facilities Retired Chief Justices: రిటైర్ అయ్యాక కూడా చీఫ్ జస్టిస్ లకు ప్రత్యేక సదుపాయాలు… అవేంటంటే..

Tags