Thyroid cause Diabetes: వాతావరణ కాలుష్యం.. తినే ఆహారం కల్తీ కావడంతో చాలామంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. మధుమేహం, థైరాయిడ్ వంటి కొన్ని వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయని అనుకున్నా.. ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు.. ఒత్తిడి.. ఇతర కారణాలవల్ల చాలా మందికి వంశపారంపర్యం లేకున్నా కూడా ఈ వ్యాధులు వస్తున్నాయి. అయితే ఇటీవల చాలామందికి థైరాయిడ్ సమస్య ఎక్కువగా అవుతుంది. దీంతో ప్రతిరోజు మెడిసిన్ వాడేవారు ఎంతోమంది ఉన్నారు. ఇది మహిళలు, పురుషులు అని కాకుండా అందరిలోనూ ఉంటుంది. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారికి డయాబెటిస్ వస్తుందా? అని ఇటీవల కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వివరాల్లోకి వెళితే..
శరీరం ఒకసారి అనారోగ్యాన బారిన పడితే అనేక వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవారు డయాబెటిస్ వ్యాధి భారీనా పడే అవకాశాలు ఉన్నాయని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో రోగనిరోధక వ్యవస్థ సొంత కణజాలాలపై దాడి చేస్తాయి. దీంతో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అలాగే టైప్ వన్ డయాబెటిస్ ఉన్న వారిలో థైరాయిడ్ సమస్యలు కూడా ఉంటాయి. ఈ రెండు వ్యాధులు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటుందని కొందరు వైద్యులు తెలుపుతున్నారు.
థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయని పక్షంలో అది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. ఇలా చేయడం వల్ల మధుమేహం వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అప్పటికే మధుమేహం వ్యాధి ఉన్నవారిలో థైరాయిడ్ సమస్యలు కూడా బయటపడుతూ ఉంటాయి. ఈ రెండు ఉన్న వారిలో రక్తంలో చక్కెర నిల్వలు తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. అలాగే గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అసాధారణమైన బరువు పెరుగుతారు. మానసికంగా ఒత్తిడితో ఉంటారు. అల్జీమర్స్ వ్యాధికి గురవుతారు. మధుమేహం ఉన్న వారిలో థైరాయిడ్ సమస్యలు ఉంటే చక్కెర నిల్వలు తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రక్తం సరఫరా లోను ఇబ్బందులు కలుగుతాయి.
Also Read: శరీర రోగ నిరోధక శక్తిని పెంచే హెల్త్ సీక్రెట్స్ ఇవే..
అందువల్ల ఏదో ఒకటి వ్యాధిని గుర్తించిన తర్వాత వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ముందుగా థైరాయిడ్ వస్తే దానిని నియంత్రించుకోవడానికి నిత్యం పరీక్షలు చేయించుకోవాలి. అలాగే సరైన మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. థైరాయిడ్ ను కొందరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మొదట్లోనే నియంత్రించే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత ఎటువంటి సమస్యలు ఉండవు.
అలాగే డయాబెటిక్ వ్యాధి బారిన పడినవారు సైతం నిత్యం వ్యాయామం చేస్తూ.. కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాధి తీవ్రత పెరిగిన కొద్దీ ఇతర కొత్త వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో ప్రాణానికి నష్టం ఉండే అవకాశం ఉందని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఓవైపు మెడిసిన్ వాడుతూనే.. మరోవైపు వ్యాయామం చేయిస్తూ ఉండాలి.