Sleep : కంటి నిండా నిద్ర లేకపోతే బరువు పెరుగుతామా?

Sleep : మనకు నిద్ర అవసరం ఎంతో ఉంటుంది. మన శరీరం పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే నిద్ర పోవాల్సిందే. కంటి నిండా హాయిగా నిద్ర పోతనే ఆరోగ్యం దక్కుతుంది. నిద్ర లేమితో అనారోగ్య సమస్యలు వస్తాయి. సరైన నిద్ర పోకపోతే బరువు పెరిగే అవకాశాలుంటాయి. నిద్ర సరిగా పట్టకపోతే కూడా బరువు పెరుగుతారు. ప్రస్తుత కాలంలో నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వృత్తికే సమయం కేటాయిస్తున్నారు. కానీ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. దీంతో […]

Written By: Srinivas, Updated On : March 18, 2023 11:29 am
Follow us on

Sleep : మనకు నిద్ర అవసరం ఎంతో ఉంటుంది. మన శరీరం పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే నిద్ర పోవాల్సిందే. కంటి నిండా హాయిగా నిద్ర పోతనే ఆరోగ్యం దక్కుతుంది. నిద్ర లేమితో అనారోగ్య సమస్యలు వస్తాయి. సరైన నిద్ర పోకపోతే బరువు పెరిగే అవకాశాలుంటాయి. నిద్ర సరిగా పట్టకపోతే కూడా బరువు పెరుగుతారు. ప్రస్తుత కాలంలో నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వృత్తికే సమయం కేటాయిస్తున్నారు. కానీ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. దీంతో నిద్రను కూడా త్యాగం చేస్తున్నారు. దీంతో అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు.

మనకు కడుపు నిండ తిండి కంటి నిండ నిద్ర లేకపోతే ఇబ్బందులే వస్తాయి. నిద్ర లేమి బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. నిద్ర పోకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. పెద్దవారు 7-9 గంటలు కచ్చితంగా నిద్ర పోతేనే మన జీవక్రియ మెరుగవుతుంది. ఇంతకంటే తక్కువ గంటలు నిద్రపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. నిద్రలేమికి ఎన్నో కారణాలున్నాయి. నిద్రలేమి బరువు పెరిగేందుకు పరోక్ష కారణంగా నిలుస్తోంది. నిద్ర లేకపోతే బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నిద్ర మానసిక స్థితిని బాగు చేస్తుంది. బరువు తగ్గించడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. హార్మోన్లు ఉత్పత్తికి కూడా నిద్ర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆకలి పెరగడానికి దారి తీస్తుంది. ఇది కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఇలా నిద్రతో మనకు ఎన్నో రకాల లాభాలున్నాయి. కానీ నిద్రకు సరైన ప్రోత్సాహం ఇవ్వడం లేదు. ఫలితంగానే నిద్ర పోవడానికి మనం సరైన సమయం తీసుకుంటేనే మంచిది. లేదంటే మన శరీరం మనకు సహకరించదు. నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే నిద్రను నిర్లక్ష్యం చేయం.

 

తగినంత నిద్ర పోకపోతే ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర లేమితో అతిగా తిని బరువు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఒత్తిడి పెరిగితే దాని వల్ల ఎన్నో అనర్థాలు ఏర్పడతాయి. నిద్ర లేకపోవడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. జీర్ణక్రియ సవ్యంగా సాగాలంటే నిద్ర ఎంతో ఉపయోగపడుతుంది. బరువు పెరిగేందుకు కారణంగా నిలుస్తుంది. కంటి నిండ నిద్ర లేకపోతే చురుకుగా ఉండేందుకు వీలు కాదు. బద్ధకంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నా కూడా మనకు ఇబ్బందికరంగానే ఉంటుంది.

Tags