Tattoos: ఒకప్పుడు కేవలం ఆడవాళ్లు మాత్రమే అందంగా కనిపించాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆడవాళ్లను ఆకర్షించడానికి మగవారి సైతం రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా హెయిర్ స్టైల్ తో పాటు చర్మ సౌందర్యానికి అవసరమైన సాధనాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా టాటూ వేసుకునే కల్చర్ రోజురోజుకు పెరిగిపోతుంది. భిన్నమైన ఆకృతులు ఉన్న టాటూ శరీరంపై వేసుకుని ఎదుటివారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ టాటూ వేసుకోవడం వల్ల చూడడానికి బాగానే ఉంటుంది.. అలాగే ఎదుటివారిని ఇంప్రెస్ చేయవచ్చు.. కానీ శరీరం లోపల జరిగే మార్పుల గురించి తెలిస్తే మరోసారి టాటూ జోలికి వెళ్ళరు. అసలు టాటూ వేసుకోగానే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
సాధారణంగానే మన చర్మం ఎప్పటికప్పుడు ఊడిపోయి కొత్త చర్మం వస్తుంటుంది. అలాంటిది ఒక్కసారి టాటూ వేసుకుంటే సంవత్సరాల కొద్ది అలాగే ఉంటుంది. మరి ఇదేలా సాధ్యం? అన్న సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. అయినా కూడా కొందరు అదే పనిగా టాటూ వేసుకుంటూ ఉంటున్నారు. అయితే టాటూ వేసే సమయంలో నిమిషంలో 3000 సార్లు చర్మాన్ని సూదులు గుచ్చుకుంటాయి. ఇలా బాగా చర్మం నుంచి లోపలి చర్మం లోకి వెళ్లి ఇంకును రిలీజ్ చేస్తాయి. మనకు ఒక డిజైన్ కావాలని అనుకుంటే ఆ డిజైన్ ప్రకారంగా సూదులు గుచ్చుతూ సిరాను శరీరంలోకి పంపిస్తారు. ఇది చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో చెదిరిపోకుండా అలాగే ఉంటుంది.
అయితే శరీరంలోకి ఇంకు వెళ్లగానే తెల్ల రక్త కణాలు వెంటనే ఏదో వైరస్ వచ్చిందని దాన్ని అటాచ్ చేయడానికి వస్తాయి. ఈ క్రమంలో ఇంకు సెల్సు వైట్ బ్లడ్ సెల్స్ కంటే పెద్దవిగా ఉంటాయి. అయినా కూడా తెల్ల రక్త కణాలు ఇంకు సెల్స్ ను తినడానికి ప్రయత్నిస్తాయి. కానీ వాటిని తిన్న తర్వాత అవి చనిపోతాయి. అలా శరీరంలోని తెల్ల రక్తకణాలు తగ్గిపోతాయి. అలాగే ఇంకు శరీరంలో ఉండడం వల్ల అనేక రసాయనికా చర్యలు జరుగుతాయి. కొన్ని రోజుల తర్వాత చర్మం ఎర్రబడడం, దురద రావడం, వాపు రావడంతో పాటు అలర్జీ కూడా వస్తుంది. స్టెరిలైజ్ చేయని సూదులు అపరిశుభ్రమైన వాతావరణంలో శరీరానికి గుచ్చడం వల్ల వాపు, జ్వరం వస్తుంది. అలాగే హెపటైటిస్ బి, హెపటైటిస్ వ్యాధులకు దారి తీస్తుంది. ఇప్పటికే ఎయిడ్స్ వ్యాధి ఉన్న వారిని సూదులు గూర్చి సాధారణ వ్యక్తులకు మళ్లీ అదే సూదులు వాడడం వల్ల ఇది సంక్రమించే అవకాశం ఉంది.
టాటూ వేసుకున్న వారి శరీరంపై ఇంకు లోహ కణాలు ఉండటం వల్ల ఎం ఆర్ ఐ స్కానింగ్ తీసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న గాయాలు అయినప్పుడు ఎలాంటి స్పర్శ ఉండదు. కొన్ని రకాల టాటూ ఇంకులలో నాణ్యతలేని కెమికల్స్ ఉండడం వల్ల దీర్ఘకాలికంగా చర్మానికి నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎలాంటి ప్రయోజనం లేని టాటుకు దూరంగా ఉండటమే మంచిది. ఎదుటివారిని ఇంప్రెస్ చేయడానికి మంచి పనులు చేయడం అలవాటు చేసుకోవాలి.