Rabies: ఎక్కడైనా కుక్కలు ఉంటున్నాయి. ఇవి కరుస్తాయనే భయం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక పెంపుడు కుక్కుల అయితే మీద పడి గీరేస్తుంటాయి. అందుకే యజమానులు లేకుండా కుక్కలు ఉంటే వాటి దరిదాపుల్లోకి కూడా ఎవరు వెళ్లరు. ఇదిలా ఉంటే కుక్క కరిస్తే రేబిస్ వ్యాధి వస్తుంటుంది. మరి వాటి గోర్లతో గీరితే ఈ వ్యాధి వస్తుందా లేదా అనే వివరాలు తెలుసుకుందాం.
కుక్క కరిచిన వెంటనే రేబిస్ టీకా తీసుకోవాలి. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడవచ్చట. అయితే మీకు రోబిస్ వ్యాధి కనుక సోకితే కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. అవేంటంటే.. కొందరు నీళ్లంటే భయపడుతుంటారు. ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం రావడం మొదలైన సంకేతాలను కనిపిస్తాయట.
ఇక ఈ వ్యాధి సోకిన వ్యక్తి చలికి అసలు తట్టుకోలేడు, వెలుతురును చూడటానికి చాలా ఇబ్బంది పడతారట. ఇప్పటి వరకూ కుక్క కాటు ద్వారా మాత్రమే రేబిస్ సోకుతుందని భావించారు కానీ కుక్కలు కాలి గోరుతో గీరినా కూడా ఈ వ్యాధి సోకుతుంది అంటున్నారు నిపుణులు. ఈ విషయం ఓ పరిశోధనలో తేలిందట.
గతంలో కూడా ఒక మహిళ పాదం మీద కుక్క పంజాతో గీరిందట. ఆమె కాలికి గాయమై రక్తం కారితే కేవలం నీటితో శుభ్రం చేసుకుందట. కాటు వేయలేదని లైట్ తీసుకుందట. కానీ ఆమెకు రేబిస్ సోకడంతో హాస్పిటల్ తీసుకెళ్లగా కొన్ని రోజులకు మరణించింది. శునకాలు పదే పదే కాలి గోర్లు, పంజాను నాలుకతో నాకుతుంటాయనే విషయం తెలిసిందే. అంతే రేబిస్ వైరస్ వాటి పంజాపై చేరుతుంది. అలాంటి సందర్భాల్లో వాటి గోర్లు మన శరీరానికి గీసుకున్నా తాకినా సరే రేబిస్ సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ మహిళ ఘటనలో అదే కుక్క మరో నలుగురిని కరిచిందట. కుక్క కరిచిన నలుగురు టీకా వేయించుకోవడం వల్ల వారు ప్రాణాపాయ స్థితి నుంచి భయటపడ్డారు. కానీ గీరిందని లైట్ తీసుకున్న మహిళ మాత్రం ప్రాణాలు కోల్పోయింది. అందుకే కుక్కలతో జాగ్రత్త.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Can rabies come from a dog bite or scratch
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com