Diabatic People Can Eat Egg: దేశంలో షుగర్ బారిన పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డయాబెటిక్ పేషెంట్లు తీసుకునే ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిళ్లు, మానసిక ఇబ్బందులు, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల వైరస్ బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. డయాబెటిస్ బారిన పడిన వాళ్లు ఆహారంలో మార్పులతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి హాని ఉండని ఆహారాన్ని తీసుకుంటే మంచిది.
షుగర్ పేషెంట్లకు కోడిగుడ్డు తినే విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. డయాబెటిక్ రోగులలో చాలామంది కోడిగుడ్డు తింటే గుండె జబ్బుల బారిన పడతామని భావిస్తున్నారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో అందులో నిజం లేదని తేలింది. గుడ్లు తినే వారిలోనే గుండె వ్యాధుల ముప్పు తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం.
ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ తో బాధ పడేవారిలో గుడ్డు వల్ల గుండె సమస్యలు తగ్గాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రానికి 12 గుడ్ల చొప్పున తినే డయాబెటిక్, టైప్-2 డయాబెటిక్ బాధితులకు గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉంది. వాలంటీర్లుగా పాల్గొన్న వారిని మూడు గ్రూపులుగా విభజించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.
గుడ్డు తీసుకోవడం వల్ల శరీరంలోకి చేరే ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు డయాబెటిస్ రోగుల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. డయాబెటిస్ రోగులు రోజువారీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చు.