Brown Bread: కొన్ని ఆహారాలను తినడం చాలా మందికి అలవాటు. కానీ వాటి వల్ల జరిగే ప్రయోజనాలు మాత్రం తెలియదు. తెలియకున్నా వారి ఆరోగ్యం మాత్రం పదిలంగా ఉంటుంది. అదే విధంగా మీకు బ్రౌన్ బ్రెడ్ తినే అలవాటు ఉందా? ఉంటే ఎప్పుడు తింటారు? ఎలా తింటారు అనే విషయాలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓ సారి దీని వల్ల ఉపయోగాలు తెలిస్తే మీ డైట్ లో కచ్చితంగా ఈ బ్రౌన్ బ్రెడ్ ఉండేలా చేసుకుంటారు.
మనలో చాలా మంది తెల్లగా ఉండే బ్రెడ్‌నే తింటారు. అయితే బ్రౌన్ బ్రెడ్‌తోనే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇదెలా ఉంటే వైట్ బ్రెడ్ తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయట. అయితే ఈ బ్రెడ్ తినడం వల్ల బరువు పెరగుతారట. అంతేకాదు బ్లడ్‌లో షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయట.
ఈ బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల పోషకాలు అందడమే కాదు.. ఎన్నో సంవత్సరాల నుంచి బాధ పడెతున్న వ్యాధులకు కూడా చెక్ పెట్టవచ్చట. బ్రౌన్ బ్రెడ్‌లో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు.
పేగు కదలికలకు సహాయ పడుతుంది. పొట్ట సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది కొద్దిగా తీసుకున్నా కడుపు నిండుతుంది. అలాగే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు.అంతే కాకుండా బీపీ, షుగర్ వంటి వాటిని నియంత్రణలో ఉంచుతుంది. షుగర్, బీపీ ఉండేవారు బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం ఉత్తమం. బ్రైన్ బ్రెడ్ ను గోధుమ పిండితో తయారు చేస్తారు కాబట్టి.. పుష్కలంగా పోషకాలు లభిస్తాయి. ఇది తిన్న వెంటనే శరీరంలో తక్షణమే శక్తి పెరుగుతుంది.