Bride Going to Exam Hall:ఈరోజుల్లో ఆడపిల్లలకు చదివించడానికి చాలా మంది తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. కానీ అమ్మాయికి చదువు ఎంత ముఖ్యమో ఈ పెళ్లికూతురును చూసి నేర్చుకోవాలని అందరూ అంటున్నారు. అక్షరాస్యత అభివృద్ధి కోసం దేశాలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంటాయి. ముఖ్యంగా ఆడపిల్లల చదువు కోసం మనదేశం ‘బేటి బచావో.. బేటీ పడావో..’ లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ఈ తరుణంలో ప్రతి అమ్మాయి చదువుకునే అవసరం ఉంది. అయితే ఆడవాళ్లకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా వారు పెళ్లి చేసుకునే సమయం వచ్చేసరికి చదువుకు ఆటంకం ఏర్పడుతుంది. కానీ చదువుకోవాలనుకునే ఆడపిల్లకు పెళ్లి అడ్డం కాదని ఓ పెళ్లికూతురు నిరూపించింది. పెళ్లి కంటే చదువే ముఖ్యమని చాటి చెప్పింది. పెళ్లిముహూర్తం, పరీక్ష తేదీ ఒకే సమమానికి వచ్చినప్పుడు ఆ పెళ్లికూతురు దేనికి ప్రాధాన్యత ఇచ్చిందో చూడండి..
ఓ పెళ్లి కూతురు, పెళ్లికొడుకుతో కలిసి డిగ్రీ సెమిస్టర్ పరీక్షకు హాజరయింది. మంది మార్బలంతో పెళ్లి మండపంలో ఉండాల్సిన వీరు పరీక్ష కేంద్రానికి రావడంతో అందరూ ఆశ్చర్యపోచారు. ‘పెళ్లి చేసుకునేవారు ఇక్కడున్నారేంటి..?’ అని పరీక్ష రాసేందుకు వచ్చిన వారు వీరినే చూస్తూ ఉండిపోయారు. ఇంతలో పెళ్లి కూతురు తను రూల్ నెంబర్ చూసుకొని గదివైపునకు వెళ్లింది. పెళ్లికొడుకు కింద వెయిట్ చేశాడు. వెంటనే ఆమె పరీక్ష హాల్లోకి వెళ్లి ఇతరుల్లాగా ఆన్సన్ పేపర్ తీసుకొని పరీక్ష రాసింది. ఆ తరువాత పెళ్లి మండపానికి ఇద్దరు కలిసి వెళ్లారు.
గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన శివాంగి తన పెళ్లి కంటే సెమిస్టర్ పరీక్షలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ పరీక్ష ఇప్పుడు కాకపోతే మళ్లీ రాయొచ్చు. పెల్లి ముహూర్తం రాదు. కానీ ఈ యువతి చదువకు ప్రాధాన్యం ఇచ్చిన తీరును చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. పెళ్లికూతురు డ్రెస్సులోనే పరీక్ష హాల్లోకి వచ్చిన ఈమెను అందరూ చూసి గర్వించారు. ఆమె చదువుకు ఇచ్చిన ప్రాధాన్యతను చూసి ఆశ్చర్యపోయారు. ప్రతీ ఒక్కరు చదువుపై ఇలా శ్రద్ధ పెడితే అన్నత శిఖరాలకు చేరుకోవచ్చని అనుకున్నారు.
Also Read: I married my dog: శునకమే కనకం.. కుక్కను పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తున్న మహిళ
పరీక్ష తరువాత శివాంగి మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి తేదిని నిర్ణయించినప్పుడు పరీక్ష తేదీ రాలేదు. అయితే తనకు పరీక్ష ఎంత ముఖ్యమో కాబోయే భర్త పార్త్ పడాలియాకు తెలిపింది. దీంతో ఇరు కుటుంబాలు తీవ్ర చర్చలు జరిపిన తరువాత శివాంగి మాటకే విలువ ఇచ్చారు. అంతేకాకుండా పెళ్లికొడుకుదగ్గరుండి మరీ పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. ఆడవాళ్లకు చదువు ఎంత ముఖ్యమో ఈమెను చూసి నేర్చుకోండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read: Bigg Boss Priya: నైట్ వేర్ లో హాట్ ఫోజులు.. బెడ్ రూమ్ వీడియో షేర్ చేసి షాకిచ్చిన బిగ్ బాస్ ప్రియ