Blood Purify: మనిషి శరీరానికి రక్తం చాలా అవసరం. రక్తం శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు అందిస్తుంది. అయితే మనం తీసుకునే ఆహారం వల్ల కొన్ని కొన్ని సార్లు రక్తం చిక్కబడుతుంది. లేదా ఇందులో కొవ్వు పదార్థాలు చేరుతాయి. ఫలితంగా ఆ కొవ్వు రక్తనాళాల్లో పేరుకుపోతుంది. అలా పేరుకుపోయి అంతిమంగా రక్త పోటుకు దారితీస్తుంది. సరైన సమయంలో మందులు వాడకపోతే రక్తపోటు సమస్య తీవ్రంగా పెరిగి గుండెపై ప్రభావాన్ని చూపుతుంది. అలా గుండెపై ఒత్తిడి పెరిగి హార్ట్ స్ట్రోక్ కు దారితీస్తుంది. అందుకే రక్తాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది..
కొన్ని రకాల పండ్ల రసాలు మన శరీరంలోని రక్తంలో విషతుల్యాలను బయటికి పంపించి శుద్ధి చేస్తాయి.
బీట్ రూట్ జ్యూస్..
దీనిపై చెక్కు తొలగించి.. చిన్న చిన్న ముక్కలుగా కోసి.. ఆ రసాన్ని ఉదయం తాగితే కాలేయం శుద్ధి అవుతుంది. అంతేకాదు రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తంలో పేరుకుపోయిన కొవ్వులు కరిగిపోతాయి. అన్నింటికీ మించి రక్తంలో ఉన్న విష తుల్యాలు బయటికి వెళ్తాయి.
క్యారెట్ జ్యూస్
ఇందులో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్ ను ఉదయం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాదు రక్తంలో ఉన్న ప్రీ రాడికల్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
సెలరీ ఆకు జ్యూస్
ఈ ఆకు జ్యూస్ ను ఉదయం తీసుకోవడం వల్ల మూత్రపిండాలు అధికంగా రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అందులో ఉన్న మలినాలను బయటికి పంపిస్తాయి. కిడ్నీలు సక్రమంగా పనిచేయడం వల్ల మూత్ర విసర్జన కూడా బాగుంటుంది
నిమ్మరసం
రోజు నిమ్మరసం తాగడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. దేహంలో రక్తం శుద్ధి అవుతుంది. వివిధ రకాల మలినాలు బయటికి వెళ్తాయి.
వెల్లుల్లి జ్యూస్
సాధారణంగా ఈ జ్యూస్ ను పాశ్యాత్య దేశాలలో ఎక్కువగా తాగుతుంటారు. దీనివల్ల రక్తం శుద్ధి అవుతుంది. యాంటి మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్న వెల్లుల్లి రసం రక్తపోటును నివారిస్తుంది. రక్తంలో పేరుకుపోయిన కొవ్వును కరగదీస్తుంది.
అల్లం రసం
మన పురాణాలనుంచి అల్లం గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. అల్లాన్ని రసం చేసుకుని తాగడం వల్ల రక్తపోటు సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాదు రక్తాన్ని శుద్ధి కూడా చేసుకోవచ్చు.
పసుపు రసం
పచ్చి పసుపు ముక్కల్ని జ్యూస్ లాగా చేసుకుని తాగొచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో మలినాలను శుభ్రం చేస్తాయి.
క్రాన్ బెర్రీ జ్యూస్
క్రాన్ బెర్రీ ఫలాలు ఎక్కువగా విదేశాల్లోనే లభిస్తాయి. ఈ రసం ఎక్కువగా తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. విష తుల్యాలు బయటికి వెళ్తాయి.
ఆపిల్ రసం
ఇందులో ఉన్న పెక్టిన్ అనే పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతిమంగా అది రక్తాన్ని శుద్ధి చేయడానికి పరోక్షంగా తోడ్పడుతుంది.