
దేశంలో రోజురోజుకు రక్తపోటుతో బాధ పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బీపీ సమస్యతో బాధ పడేవాళ్లు అధిక బరువు ఉంటే బరువు తగ్గడం ద్వారా బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. బీపీ కంట్రోల్ లో ఉండాలంటే సాధారణంగా తీసుకునే ఉప్పు కంటే తక్కువగా ఉప్పును తీసుకోవాలి. పప్పు, కూరగాయలలో ఉప్పును వీలైనంత తగ్గిస్తే మంచిది. ఉప్పు ఎక్కువగా వేసి చేసే పిండి వంటలు, ఊరగాయలు, పచ్చళ్ళు తక్కువగా తీసుకోవాలి.
Also Read: 8 గంటలకు పైగా నిద్రపోతున్నారా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్..?
తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవడంతో పాటు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వారంలో సగం కంటే ఎక్కువ రోజులు ఆకుకూరలు తీసుకోవాలి. హై బీపీ ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీలైనంత వరకు ఆహారంలో సాచురేటెడ్ కొవ్వులు తక్కువగా ఉండే విధంగా ఆహారం తీసుకుంటే మంచిది.
Also Read: నెయ్యి తింటున్నారా.. నెయ్యి వల్ల కలిగే లాభాలు ఇవే..?
రక్తపోటును అదుపులో ఉంచాలంటే సరైన ఆహారపు అలవాట్లను పాటించడంతో పాటు వ్యాయామం చేస్తే మంచిది. బేకరీ ఫుడ్స్, చిరుతిళ్లు, వేపుళ్లకు దూరంగా ఉండాలి. అధిక రక్తపోటుతో బాధ పడేవాళ్లు తృణ ధాన్యాలను డైట్ లో చేర్చుకుంటే మంచిది. ఒక అధ్యయనంలో తృణధాన్యాలు రక్తపోటు నిరోధక మందులా పని చేస్తాయని వెల్లడైంది. గోధుమ పిండి, ఓట్స్ పిండి, బార్లీ పిండి రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడతాయి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
క్రమంగా మందులు వాడటంతో పాటు సరైన ఆహారం తీసుకుంటే మాత్రమే రక్తపోటును అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది. వంటకు నువ్వుల నూనె వాడితే కూడా రక్తపోటును కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.