Benefits of Smiling Daily: నవ్వు నాలుగు విధాల చేటు అని ఒకప్పటి మాట.. కానీ నేటి కాలంలో నవ్వు ఎంతో ఆరోగ్యకరమని వైద్యులే చెబుతున్నారు. ఎందుకంటే వివిధ కారణాలవల్ల చాలామంది హ్యాపీనెస్ కు దూరమవుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం చేసే వారితోపాటు చదువుకునే విద్యార్థులు సైతం ఒత్తిడి కారణంగా సరైన విధంగా నవ్వలేకపోతున్నారట. ఇలా నవ్వలేకపోవడం వల్ల వారు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని కొందరు వైద్యులు పేర్కొంటున్నారు. అయితే హ్యాపీనెస్ గా ఉండడంవల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇలా నవ్వితే ఏడు సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారట. అదెలా అంటే?
Also Read: Karonda health benfits : కరోండా పండ్లు ప్రయోజనాలు తెలిస్తే.. అసలు తినకుండా ఉండలేరు
కొన్ని పరిశోధనల ప్రకారం.. మగవారి కంటే ఆడవారు, చిన్నపిల్లలు ప్రతిరోజూ ఎక్కువగా నవ్వుతారట. చిన్నపిల్లలు ప్రతిరోజు 300 నుంచి 400 సార్లు స్మైల్ ఇస్తూ ఉంటారట. ఆడవాళ్లు 50 నుంచి 60 సార్లు నవ్వే ప్రయత్నం చేస్తారట. మగవాళ్లు మాత్రం 8 నుంచి 20 సార్లు మాత్రమే నవ్వే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ప్రతిరోజు ఎంత ఎక్కువ నవ్వితే అంత ఆరోగ్యంగా ఉంటారని వైద్య పరిశోధకులు తెలుపుతున్నారు. ఒక చిన్న స్మైల్ చేయడం వల్ల dopamine, serotonin, endorphin అనే హార్మోన్స్ విడుదలవుతాయి. ఈ హార్మోన్లు రిలీజ్ కావడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. అప్పటివరకు ఎంత ఒత్తిడి ఉన్న చిన్న స్మైల్ తో అది దూరమైపోతుంది. దీంతో శరీరంలోని అవయవాలు ఆక్టివ్ గా మారిపోతాయి. ఇదే సమయంలో మెదడు ప్రశాంతంగా మారి కొత్త ఆలోచనలు వస్తాయి.
అయితే కొందరు మనస్ఫూర్తిగా నవ్వలేక పోతారు. అలా కాకుండా బలవంతంగా నవ్వినా కూడా బ్రెయిన్ షార్ప్ గా అయ్యే అవకాశం ఉంది. లోపల బాధ ఉన్న కొందరు పైకి నవ్వుతూ ఉంటారు. ఇలా చేసినా కూడా కొంత ఒత్తిడి తగ్గించుకొని అవకాశం ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా నవ్వితే మాత్రం శరీరంలోని భాగాలన్నీ కదలిక అవుతాయి. ఒక చిన్న స్మైల్ 10 అవయవాలను కదలిక చేస్తుంది. అదే మనస్ఫూర్తిగా నవ్విన వారిలో 40 నుంచి 50 వరకు అవయవాలు కదలిక ఏర్పడి యాక్టివ్ అవుతాయి.
Also Read: Benfits Of Apple: ఆపిల్ పండుతో ఎన్ని లాభాలో తెలుసా?
ఇలా శరీరంలోని అవయవాలు ఎప్పటికప్పుడు కదలిక ఉండడంవల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ఈ కారణంగా శరీరంపై ముఖ్యంగా మొహంపై ఉన్న ముడతలు తొలగిపోతాయి. దీంతో నిత్యం యవ్వనంగా ఉండిపోతారు. ప్రతిసారి నవ్వినప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ రిలీజ్ అవుతాయి. దీంతో శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉండగలుగుతారు. అందువల్ల రోజుకు ఒకసారి నవ్వే ప్రయత్నం చేయండి. లేదా ఎప్పుడూ సంతోషంగా ఉండే స్నేహితులతో మాత్రమే కలిసి ఉండండి. కుటుంబ సభ్యులను కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి. అలా చేయడం ద్వారా మీతో పాటు మీ చుట్టుపక్కల వారిని కూడా ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం చేయగలుగుతారు. ఇక కొన్ని పరిశోధనల ప్రకారం ఇలా ఎప్పటికీ నవ్వుతూ ఉండేవారు.. నవ్వని వారి కంటే ఏడు సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారని పరిశోధనలో తేలింది.