Butter Milk: భోజనం చేసిన తరువాత మజ్జిగ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Butter Milk: మన ఆహార అలవాట్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫిజాలు, బర్గర్లు వంటివి తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. జంక్ ఫుడ్స్ కు అలవాటు పడి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లేదు. పలు రోగాలకు కేంద్రంగా మారుతున్నారు. ఇక వేసవిలో శీతల పానీయాలు తాగుతూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. అయినా వారిలో మార్పులు కానరావడం లేదు. అదే కొబ్బరినీళ్లు తాగితే ఎంతో శక్తి వస్తుందని తెలిసినా కూల్ డ్రింక్స్ కే మొగ్గు చూపుతారు. వేసవిలో మజ్జిగ తాగితే ఎన్నో […]

Written By: Srinivas, Updated On : March 4, 2023 11:20 am
Follow us on

Butter Milk

Butter Milk: మన ఆహార అలవాట్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫిజాలు, బర్గర్లు వంటివి తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. జంక్ ఫుడ్స్ కు అలవాటు పడి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లేదు. పలు రోగాలకు కేంద్రంగా మారుతున్నారు. ఇక వేసవిలో శీతల పానీయాలు తాగుతూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. అయినా వారిలో మార్పులు కానరావడం లేదు. అదే కొబ్బరినీళ్లు తాగితే ఎంతో శక్తి వస్తుందని తెలిసినా కూల్ డ్రింక్స్ కే మొగ్గు చూపుతారు. వేసవిలో మజ్జిగ తాగితే ఎన్నో లాభాలుంటాయి. కానీ తాగడానికి ఇష్టపడరు. ఏదైనా మనకు కీడు చేసే వాటిని ఎక్కువగా ఇష్టపడటం వల్ల అనర్థాలే వస్తాయి.

వేసవి కాలంలో ఓ గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వడ దెబ్బ తగలకుండా చేయడంలో మజ్జిగ ఎంతో ఉపయోగపడుతుంది. మజ్జిగ, బటర్ మిల్క్, లస్సీ అని వివిధ పేర్లతో పిలిచినా ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాల రీత్యా మధ్యాహ్న భోజనం తరువాత మజ్జిగ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపుకు ఉపశమనం కలుగుతుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, విటమిన్ బి12, ప్రొటీన్లు, పోషకాలు మెండుగా ఉన్నాయి.

Also Read: Sugar Control: 12 రోజుల పాటు ఇవి తింటే షుగర్ కంట్రోల్

 

మజ్జిగలో మిరియాలు, ధనియాల పొడి, దొడ్డు ఉప్పు, మసాలాలు కలిపి తీసుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. మజ్జిగలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అధిక బరువును తగ్గించుకోవడానికి ఇది మంచి పానీయం. భోజనం చేసిన తరువాత మజ్జిగను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా పేగు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది సహాయపడుతుంది. కండరాలు, చర్మం, ఎముకలు బలంగా కావడానికి సహకరిస్తుంది.

Butter Milk

మజ్జిగ తీసుకోవడం వల్ల ఎసిడిటిని తగ్గించుకోవచ్చు. శొంఠి, మిరియాలు, మసాలాలు కలుపుకుని తాగితే గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పేగులకు ఆరోగ్యకరమైన పోషణ అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలవిసర్జనలో ఇబ్బందులు కలిగించే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వ్యాధి రాకుండా చేస్తుంది. పొట్టలో ఎలాంటి కాలుష్య కారకాలు ఉండకుండా క్లియర్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మజ్జిగ మన శరీరానికి ఇన్ని రకాల లాభాలు చేకూరుస్తుంది.

Also Read: Tea: ఈ టీ శరీరంలో 40 రోగాలను దూరం చేస్తుంది తెలుసా?