Self confidence : ఆత్మరక్షణలో పడిపోకు.. ఎన్నటికీ బయటికి కనపడనీయకు

Self confidence : డిఫెన్స్.. అంటే రక్షణ. క్రికెట్ భాషలో చెప్తే అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ప్రత్యర్థి బౌలర్ పక్కా లైన్ అండ్ లెంగ్త్ బాల్స్ వేస్తున్నప్పుడు.. భయంకరమైన భీమర్లు సంధిస్తున్నప్పుడు.. బ్యాట్స్ మెన్ రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిపోతాడు. అదే.. డిఫెన్స్ ఆడటం మొదలు పెడతాడు. తప్పదు మరి.. ఏ మాత్రం ఎడ్జ్ ఇచ్చినా ఎవరో ఒకరు చేతిలో పడిపోతాడు. లేదంటే.. వికెట్ల ముందు దొరికిపోతాడు.   కానీ.. నువ్వు డిఫెన్స్ ఆడుతున్నావంటే.. ఆత్మరక్షణలో పడిపోయావని అర్థం. […]

Written By: NARESH, Updated On : December 17, 2022 11:34 am
Follow us on

Self confidence : డిఫెన్స్.. అంటే రక్షణ. క్రికెట్ భాషలో చెప్తే అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ప్రత్యర్థి బౌలర్ పక్కా లైన్ అండ్ లెంగ్త్ బాల్స్ వేస్తున్నప్పుడు.. భయంకరమైన భీమర్లు సంధిస్తున్నప్పుడు.. బ్యాట్స్ మెన్ రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిపోతాడు. అదే.. డిఫెన్స్ ఆడటం మొదలు పెడతాడు. తప్పదు మరి.. ఏ మాత్రం ఎడ్జ్ ఇచ్చినా ఎవరో ఒకరు చేతిలో పడిపోతాడు. లేదంటే.. వికెట్ల ముందు దొరికిపోతాడు.

 

కానీ.. నువ్వు డిఫెన్స్ ఆడుతున్నావంటే.. ఆత్మరక్షణలో పడిపోయావని అర్థం. అది తొట్రుపాటుకు అవకాశం ఇస్తుంది. ఇంకాసేపు అదే కొనసాగితే ఆందోళనకు దారితీస్తుంది. కాబట్టి టెన్షన్ పడకు. ఒకవేళ పడ్డా.. అది నీ ముఖంలో అస్సలు కనపడనీయకు. హావభావాల్లో కించిత్తుకూడా అర్థం కానివ్వకు. పొరపాటున అదిగానీ.. నీ ప్రత్యర్థి చూశాడో… ఎక్కడ లేని ఆత్మవిశ్వాసాన్ని వెంటబెట్టుకొని.. నీ మీద ఏకంగా దండయాత్రకు దిగుతాడు.

 

అప్పుడు వాడి చేతిలోని బంతి క్రికెట్ బాల్ కాదు.. మండే అగ్నిగోళం అవుతుంది. నిప్పులు చిమ్ముతూ దూసుకొచ్చే బంతులకు నీ దగ్గర సమాధానమే ఉండదంటే నమ్ము. నీ అస్త్ర శస్త్రాలన్నీ కకావికలం అయిపోతాయి. నీ షాట్ సెలక్షన్ గతి తప్పుతుంది. ఎటాకింగ్ థాట్ అనేదే అడ్రస్ లేకుండా పోతుంది. ఒక్కో బంతి మెరుపు వేగంతో దాడి చేస్తుంటే.. వాటిని ఎదుర్కోలేక ఆ ఓవర్ ఎప్పుడైపోతుందా అని స్కోరుబోర్డుకెళ్లి చూడాల్సిన దుస్థితిలో.. హీన స్థితిలో.. దారుణ పరిస్థితిలో పడిపోతావ్.. చివరకు వికెట్లముందు బొక్కబోర్లా పడతావ్.

– గుర్తు పెట్టుకో..
జీవితం కూడా క్రికెట్టే. సమస్యలే నువ్వెదుర్కునే బంతులు. నీ ప్రత్యర్థులు/పరిస్థితులే బౌలర్లు. డిఫెన్స్ అవసరమైన చోట తప్పదు. కానీ.. ఆత్మరక్షణలో పడిపోకు. ఒకవేళ పడిపోయినా.. ఎన్నటికీ బయటికి కనపడనీయకు. కనపడితే ఏమవుతుందో చదివారు కదా..

-రాధా