Beetroot: బీట్‌రూట్ గురించి చాలా మందికి తెలిసిందే. తినడానికి ఇష్టం లేకపోయినా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. ముఖ్యంగా రక్త హీనతను తగ్గించడంలో కింగ్ గా పని చేస్తుంది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇక ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి ఎంతో మంచిది. ఇక ఈ బీట్‌రూట్‌ను ఫేస్ ప్యాక్‌గా కూడా వాడవచ్చు. ఇలా వాడటం వల్ల చర్మకాంతి రెట్టింపు అవుతుంది. మీ చర్మం నిగనిగ మెరుస్తుంది అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఈ బీట్ రూట్ ఫ్యాక్ ను ఎలా వేసుకోవాలో కూడా చూసేద్దాం.
ముఖాన్ని అందంగా ఉంచుకోడానికి మార్కెట్‌లో దొరికే రకరకాల ప్రొడక్ట్‌లు వాడుతుంటారు. కానీ ఫలితం ఉండదు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే లభించే వాటితో నేచురల్‌గా మేనిఛాయను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. దీని కోసం కేవలం బీట్‌రూట్‌ను ఫేస్‌ప్యాక్‌గా ఉపయోగిస్తే చాలు.ఎండాకాలం వచ్చిందంటే చాలు చర్మం ఊరికే కమిలిపోతుంది. కాసేపు బయటకు వెళ్లి వస్తే చర్మాన్ని, ఫేస్ ను చూడాలంటే భయం వేసేంత కమిలిపోతుంది. మొహం మొత్తం ట్యాన్ పట్టేస్తుంది కూడా.
ఇలాంటి సమస్య వెంటాడకుండా ఉండాలంటే బీట్‌రూట్-పెరుగుతో ప్యాక్ వేసుకుంటే ఎండకు పట్టిన టాన్ మొత్తం తొలగిపోతుంది. ఇందుకోసం ఓ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా బీట్‌రూట్ జ్యూస్ తీసుకొని బాగా కలపండి. దీనిని ముఖానికి అప్లై చేసుకొని కాసేపటి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మెరుగ్గా చేసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఓ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బీట్‌రూట్ తురుము, రెండు టేబుల్ స్పూన్ల బియ్యంపిండి, కొద్దిగా చక్కెర, పెరుగు కలపుకొని ప్యాక్ లా ఉపయోగించవచ్చు.
దీనిని ముఖానికి అప్లై చేసి సర్కిల్ మోషన్‌లో మసాజ్ చేసుకోవాలి. పది నిమిషాలు అలానే ఉంచి నీటితో క్లీన్ చేసుకోవాలి.. మరో సూపర్ ప్యాక్ కూడా తెలుసుకోండి. ఓ టేబుల్ స్పూన్ పచ్చిపాలు, కొన్ని చుక్కల బాదం నూనె 2 టేబుల్ స్పూన్ల బీట్‌రూట్ జ్యూస్ కలపి.. ముఖానికి అప్లై చేసుకోండి. ఇలా ప్యాక్ వేసుకొని కాసేపు అయ్యాక అంటే 15 నిమిషాల పాటు అలానే ఉంచి నీటితో క్లీన్ చేయండి. ఈ ప్యాక్ వాడితే స్కిన్ ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది.
అయితే బీట్‌రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి.. ముఖంపై డార్క్ స్పాట్స్, పిగ్మంటేషన్, సన్‌టాన్‌ని దూరం చేయడంలో సహాయం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతుంటాయి. చర్మం కాంతివతంగా మారుతుంది అంటున్నారు నిపుణులు.
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం సోషల్ మీడియా నిపుణుల సలహా మేరకు మాత్రమే అందించాం. వీటిని ఒకే తెలుగు నిర్ధారించదు.