Curd At Night : రాత్రిపూట పెరుగు తింటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త!

పెరుగును సరైన సమయంలో మాత్రమే తినాలి. లేకపోతే అనారోగ్య సమస్య వస్తాయి. రాత్రిపూట పెరుగు అన్నం తిని పడుకుంటే బాగా నిద్ర పడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ రాత్రి తినడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. పెరుగులో టైరమైన్ ఉంటుంది. దీనివల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అలాగే శ్వాసకోశ సమస్యలు రావడంతో పాటు గొంతులో కఫం కూడా ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు

Written By: Kusuma Aggunna, Updated On : August 27, 2024 11:39 am

Curd At Night

Follow us on

Curd At Night :  సాధారణంగా భోజనం పూర్తయిన తర్వాత చివరకు పెరుగుతో అన్నం తినకపోతే అస్సలు తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. కొంతమందికి పెరుగు ఎందుకు నచ్చదు. అయితే చాలామంది రాత్రి పూట నిద్ర పడుతుందని పెరుగు తింటుంటారు. మన ఇంట్లో నానమ్మ, తాతయ్య వంటి వాళ్లు ఉంటే.. వాళ్లు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. రాత్రి పూట పెరుగు తినవద్దు. ఆరోగ్యానికి అంత మంచిది కాదనియ చెబుతుంటారు. అయిన మనం వింటేనే కదా. పర్లేదులే ఏం కాదని ఇష్టంగా తింటాం. ఆ తర్వాత అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటాం. అయితే రాత్రి పూట పెరుగు తినడం వల్ల తప్పకుండా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగు రాత్రి కంటే ఉదయం పూట తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. మరి రాత్రి పూట పెరుగు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

పెరుగును సరైన సమయంలో మాత్రమే తినాలి. లేకపోతే అనారోగ్య సమస్య వస్తాయి. రాత్రిపూట పెరుగు అన్నం తిని పడుకుంటే బాగా నిద్ర పడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ రాత్రి తినడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. పెరుగులో టైరమైన్ ఉంటుంది. దీనివల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అలాగే శ్వాసకోశ సమస్యలు రావడంతో పాటు గొంతులో కఫం కూడా ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులో మంచి ప్రొటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. కానీ సరైన సమయంలో తింటేనే ఫలితం ఉంటుంది. రాత్రిపూట పెరుగు తింటే కొవ్వు పెరుగుతుంది. దీంతో బరువు పెరుగుతారు. కొంతమందికి పెరుగు జీర్ణం కాదు. రాత్రి పూట పెరుగు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్టిక్ వంటి సమస్యలు కూడా వస్తాయి.

కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు రోజూ పెరుగు తినకూడదు. పెరుగు రాత్రిపూట తినడం వల్ల కీళ్లలో బలం తగ్గి, నొప్పులు పెరుగుతాయి. ఆర్థరైటిస్ సమస్య ఉన్న వాళ్లు అస్సలు పెరుగు తినకూడదు. అంతగా తినాలనుకుంటే పెరుగును మజ్జిగగా చేసి తినవచ్చు. కానీ చిక్కటి పెరుగు రాత్రిపూట అసలు తినకూడదు. రాత్రిపూట పెరుగు తింటే జలుబు, దగ్గు, అలర్జీ వంటి సమస్యలు కూడా వస్తాయి. పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవడం మంచిది. అప్సుడే ఇందులో ఉండే పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. ఇందులో కాల్షియం, విటమిన్లు, ప్రోబయోటిక్స్, లాక్టిక్ ఆమ్లం వంటివి ఉన్నాయి. వీటివల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. కానీ పెరుగును అలాగే తింటే బాడీ బాగా వేడి చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు పెరుగులో కొంచెం అయిన నీరు కలిపి తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. బాడీలో వేడి తగ్గుతుంది. అలాగే బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది.