Barley Seeds Benefits: ప్రస్తుత ఆహార అలవాట్లు, మారుతున్న జీవన శైలి వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. సమయం లేకపోవడం, సరైన ఫుడ్ తీసుకోకపోవడం, టెన్షన్ వంటి వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే కొన్ని ఆహార నియమాలను డైట్ లో చేర్చుకోవాలి అంటారు నిపుణులు. కొన్ని ఖర్చుతో కూడుకున్నవి అయితే మరికొన్ని చవకగా దొరుకుతాయి. మీకు బార్లీ తెలుసా? పేదల పాలిట పెన్నిది. మరి ఓ సారి ఈ బార్లీ గింజల వల్ల ఎలాంటి మంచి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.
బార్లీలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు ఎన్నో సమస్యలకు దివ్యౌషధాలుగా ఉపయోగపడుతాయి. అందుకే బార్లీ నీటిని ప్రతి రోజు ఉదయం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. పేదల సంజీవని అయినా బార్లీ డయాబెటిస్ కు చాలా మంచిది. బార్లీ నీరు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి, నియంత్రించడానికి ఉపయోగపడుతాయి.
హృదయనాళ ఆరోగ్యాన్నిమెరుగుపరచడమే కాదు.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఈ బార్లీ నీటిలో ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీనివల్ల మలబద్దక సమస్య దూరం అవుతుంది. శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కూడా తగ్గిస్తుంది బార్లీ నీటిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి కావలసిన శక్తి కూడా అందుతుంది. బరువు పెరగరు.
బార్లీ గింజలను ఉడకబెట్టి వడకట్టిన తర్వాత కాస్త రుచి కోసం నిమ్మరసం కూడా జోడించవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి అద్భుతమైనది బార్లీ నీరు. వీటిని తాగడం వల్ల మూత్రాశయ సమస్యలు దూరం చేస్తాయి. అంతేకాదు ఆరోగ్యాన్ని అందిస్తాయి. చర్మానికి చాలా మంచిది. రక్తపోటును నియంత్రించడంలో కూడా తోడ్పడతాయి. మరి తెలుసుకున్నారు కదా బార్లీ నీటితో ఎంత ఉపయోగమో..ఇన్ని ప్రయోజనాలు ఉన్న బార్లీ నీటిని తాగేసేయండి. మంచి ఆరోగ్యం మీ సొంతం చేసుకోండి.