https://oktelugu.com/

Back Pain: వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారా.. సులువుగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

Back Pain: ఈ మధ్య కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో వెన్ను నొప్పి ఒకటనే సంగతి తెలిసిందే. ల్యాప్ టాప్, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం కూర్చుని పని చేసేవాళ్లను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. వెన్నునొప్పి సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం తర్వాత రోజుల్లో ఎంతో బాధ పడాల్సి వస్తుంది. వెన్నునొప్పి సమస్యతో బాధ పడేవాళ్లు మందులు వాడటంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. వెన్నునొప్పి సమస్య వేధిస్తుంటే ఒమేగా -3 […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 21, 2022 6:51 pm
    Follow us on

    Back Pain: ఈ మధ్య కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో వెన్ను నొప్పి ఒకటనే సంగతి తెలిసిందే. ల్యాప్ టాప్, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం కూర్చుని పని చేసేవాళ్లను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. వెన్నునొప్పి సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం తర్వాత రోజుల్లో ఎంతో బాధ పడాల్సి వస్తుంది. వెన్నునొప్పి సమస్యతో బాధ పడేవాళ్లు మందులు వాడటంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.

    వెన్నునొప్పి సమస్య వేధిస్తుంటే ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వారంలో కనీసం ఒకసారైనా ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా సమస్యను దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా సులభంగా వెన్ను నొప్పి సమస్యలు దూరమవుతాయని చెప్పవచ్చు. పరగడుపున డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

    Also Read: KCR Etela Rajendar: వైరల్: పగబట్టిన ఈటలపై కేసీఆర్ కు ఇంత ప్రేమ ఉందా?

    వెన్నునొప్పికి చెక్ పెట్టే ఆహారాలలో చియా లేదా అవిసె గింజలు కూడా ఉన్నాయి. చియా, అవిసె గింజలను రాత్రంతా నానబెట్టి తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బ్రోకలీ కూడా వెన్నునొప్పి చెక్ పెట్టే మంచి ఆహారాలలో ఒకటి. బ్రోకలీ ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లను సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    బ్రోకలీని కూరగాయలలో భాగంగా లేదా సూప్ లా తయారు చేసుకుని తీసుకోవచ్చు. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా వెన్ను నొప్పి సమస్యలు దూరమవుతాయి. ఈ జాగ్రత్తలు తీసుకున్నా సమస్య తగ్గకపోతే వైద్యుల సలహాలు, సూచనల ప్రకారం పరీక్షలు చేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు.

    Also Read: Mahesh- Rajamouli Movie: మహేష్ తో చేస్తున్న సినిమా పై రాజమౌళి క్లారిటీ