
ఈ మధ్య కాలంలో వైద్యులు ప్రజలకు ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారాలను తీసుకోవాలని సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీజనల్ గా దొరికే పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ ను సులభంగా పెంచుకోవడం సాధ్యమవుతుంది. మనుషులకు రోగాలు రాకుండా, వ్యాధుల బారిన పడకుండా చేసే శక్తి ఉన్న మొక్కలలో అర్జున వృక్షం కూడా ఒకటని చెప్పవచ్చు.
మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో అర్జున వృక్షం ఎక్కువగా పెరుగుతుంది. ఈ అర్జున వృక్షానికి మరో పేరు తెల్లమద్ది. ఆయుర్వేద ఔషధాల తయారీ కోసం తెల్లమద్దిని ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. గుండె జబ్బులు, ఆస్తమా సమస్యలకు చెక్ పెట్టడంలో తెల్లమద్ది సహాయపడుతుంది. విరిగిన ఎముకలను కూడా త్వరగా అతుక్కునేలా చేసే గుణాలు తెల్లమద్దిలో ఉన్నాయి. తెల్లమద్ది చెట్టు బెరడులో కాల్షియం, అల్యూమినియం, మెగ్నిషియం ఎక్కువగా ఉంటాయి.
ఈ చెట్టు బెరడు మనకు అనేక విధాలుగా సహాయపడుతుందని చెప్పవచ్చు. అర్జున చెట్టు బెరడుని పాలలో వేసుకుని పరగడుపున తాగితే గుండె జబ్బులు దూరమవుతాయి. ఆస్తమాతో బాధ పడేవాళ్లకు తెల్లమద్ది వల్ల ఆ సమస్య దూరమవుతుంది. తెల్లమద్ది చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. ఈ బెరడు కషాయం తాగితే కాలిన గాయాలు, పుండ్లు తగ్గే అవకాశం ఉంటుంది.
పాలలో కలిపి అర్జున బెరడు చూర్ణాన్ని తీసుకుంటే వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. అర్జున చెట్టు బెరడును నూరి గడ్డ ఉన్న చోట కడితే 12 గంటల్లో ఆ గడ్డ తగ్గిపోయే అవకాశం ఉంటుంది