children : కోట్ల సంపద కన్నా కుటుంబ ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటే కోట్లు సంపాదించే వారికంటే కూడా సంతోషంగా ఉండవచ్చు. అందులో మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న పిల్లలు అనారోగ్యబారిన పడితే మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తీసుకోవాలి. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే కొందరు పిల్లలు మొండికి వేస్తూ తినరు. అందుకే చాలా సన్నగా, నీరసంగా ఉంటారు. యాక్టీవ్‌గా అసలు ఉండరు. ఇలాంటి పిల్లలను చూస్తూ పేరెంట్స్ చాలా బాధ పడుతుంటారు. అందుకే పిల్లల మానసిక ఎదుగుదల ఎంత ఇంపార్టెంటో వారి శారీరక ఎదుగుదల కూడా అంతే ఇంపార్టెంట్. మరి మీ పిల్లలు బక్కగా ఉన్నారా? జస్ట్ ఈ ఫుడ్ లు పెట్టండి బొద్దుగా, ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆలస్యం ఎందుకు అవేంటో తెలుసుకోండి.
అరటి పండు: డైలీ ఒక అరటి పండు పిల్లలకు తినిపించాలి. అరటి పండు తినిపిస్తే వారు ఆరోగ్యంగా బరువు పెరుగుతుంటారు. ఈ పండులో విటమిన్లు సి, ఎ, బి6 లు ఉంటాయి. అంతేకాదు ఫైబర్, మెగ్నీషియం, పొటాషియంలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు పిల్లలకు తక్షణ శక్తిని అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తాయి. యాక్టివ్ అవుతారు.
నెయ్యి: నెయ్యి పిల్లలకు మంచి ఆహారం. నెయ్యి పెట్టడం వల్ల పిల్లల స్కిన్, జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటాయి అంటున్నారు నిపుణులు. శరీరం బరువుగా, దృఢంగా ఉండేలా చేస్తుంది. నెయ్యిలో మంచి కొవ్వులు ఉంటాయి. బ్రెయిన్ కూడా చాలా చురుగ్గా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. త్వరగా జబ్బుల రావు.
కోడి గుడ్డు: ఉడకబెట్టిన గుడ్డును ప్రతి రోజు పిల్లలకు ఇవ్వాలి. దీనివల్ల పిల్లలకు తక్షణ శక్తి అందుతుంది. అంతేకాదు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో మంచి కొవ్వులు లభిస్తాయి. ఈ ఉడకబెట్టిన గుడ్డు వల్ల పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. ప్రతి రోజూ గుడ్డు తింటే పిల్లల ఎదుగుదలలో మార్పులు వస్తుంటాయి. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు.
పాలు: పాల వల్ల కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మంచి బరువు వస్తుంది. వారి స్కిన్, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులోని పోషకాలు పిల్లలకు అందుతాయి. వారు చురుకుగా ఉంటారు. అందుకే ఉదయం, రాత్రి పడుకునే ముందు పిల్లలకు పాలు ఇవ్వాలి. అయితే ప్యాకెట్ పాలకన్నా బర్రె, ఆవు పాలు ఇవ్వడం చాలా మంచిది.