https://oktelugu.com/

Baby Care: మీ పిల్లలు జలుబుతో బాధ పడుతున్నారా.. సులభంగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

Baby Care: చిన్నపిల్లలను తరచూ వేధించే ఆరోగ్య సమస్యలలో జలుబు ఒకటనే సంగతి తెలిసిందే. జలుబు సాధారణ వ్యాధి అయినప్పటికీ కరోనా విజృంభిస్తున్న తరుణంలో జలుబు పేరు వింటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా జలుబుకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. పిల్లలకు జలుబు వచ్చిన సమయంలో వాళ్లకు స్నానం చేయించకూడదు. పిల్లలకు జలుబు చేసిన సమయంలో స్పాంజీ లేదా గోరువెచ్చని నీటితో పిల్లల శరీరంను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 9, 2022 / 08:03 AM IST
    Follow us on

    Baby Care: చిన్నపిల్లలను తరచూ వేధించే ఆరోగ్య సమస్యలలో జలుబు ఒకటనే సంగతి తెలిసిందే. జలుబు సాధారణ వ్యాధి అయినప్పటికీ కరోనా విజృంభిస్తున్న తరుణంలో జలుబు పేరు వింటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా జలుబుకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. పిల్లలకు జలుబు వచ్చిన సమయంలో వాళ్లకు స్నానం చేయించకూడదు.

    పిల్లలకు జలుబు చేసిన సమయంలో స్పాంజీ లేదా గోరువెచ్చని నీటితో పిల్లల శరీరంను శుభ్రం చేస్తే మంచిదని చెప్పవచ్చు. గదిలోనే పిల్లల శరీరాన్ని శుభ్రం చేయాలని బాత్ రూమ్ టెంపరేచర్ కు, రూమ్ టెంపరేచర్ కు తేడా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ఆవనూనె లేదా వెల్లుల్లితో మసాజ్ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లలు జలుబుతో బాధ పడుతుంటే శరీరాన్ని నూనెతో మసాజ్ చేస్తే మంచిది.

    సాధారణంగా చిన్నపిల్లలకు ఆవిరి పట్టించడం తేలికైన పని కాదు. ఆవిరి పట్టిస్తే జలుబు, దగ్గుకు ఉపశమనం పొందే ఛాన్స్ ఉంటుంది. ఆవిరి ద్వారా నాసికా రంధ్రాలు క్లియర్ అయ్యే ఉంది. ఇలా చేయడం ద్వారా నాసికా రంధ్రాలు క్లియర్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. పిల్లలకు గోరువెచ్చని నీళ్లు తాగిస్తే జలుబు, దగ్గు తగ్గుతాయి. ఈ విధంగా చేయడం ద్వారా పిల్లల్లో బ్లాక్స్ తొలగిపోయి శ్వాస బాగా ఆడుతుంది.

    Also Read: Weight Loss: బరువు, చెడు కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ఇవే బెస్ట్ మార్గాలు !

    తల్లిదండ్రులు పిల్లల శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా జలుబుకు చెక్ పెట్టవచ్చు. వైద్యుల సూచనల ప్రకారం పిల్లలకు ఆహారం అందించాలి. ఈ వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

    Also Read: Paper Cups: పేపర్ కప్పులో టీ తాగుతున్నారా.. ఈ విషయం తెలిస్తే ఇకపై ఎవరు పేపర్ కప్ ముట్టుకోరు?