Children addicted to social media: మొబైల్ విప్లవంతో ఎన్నో రకాల పనులు ఈజీగా అవుతున్నాయి. కానీ అంతే మొత్తంలో దుష్పరిమాణాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మొబైల్ చిన్న పిల్లల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మొబైల్ స్క్రీన్ వల్ల పిల్లల అలవాట్లు.. మానసిక స్థితి పూర్తిగా మారిపోతుందని కొన్ని అధ్యయనాల తో బయటపడుతున్నాయి. ఇటీవల పీడియాట్రిక్స్ ఓపెన్ సైన్స్ లో రచించబడిన కరోలింకా ఇన్స్టిట్యూట్ నివేదించిన సమగ్ర అధ్యయనం ప్రకారం 10 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు మొబైల్ ఎక్కువ చూడడం వల్ల వారిలో మానసిక స్థితి తీవ్రంగా మారుతుందని గుర్తించారు. ఈ అధ్యయనం వివరాల్లోకి వెళితే..
గత 15 ఏళ్లలో 10 నుంచి 14 సంవత్సరాల వయసుగల 8,000 కంటే ఎక్కువ మంది పిల్లలను ఈ అధ్యయనం లోకి తీసుకున్నారు. ముఖ్యంగా స్వీడన్ తో పాటు ఇతర ప్రాంతాల్లో చేసిన పరిశోధనల ఫలితంగా అనేక విషయాలు బయటపడ్డాయి. పిల్లల్లో ADHD పెరుగుదల సమానంగా ఉంది. దీని పెరుగుదలతో పిల్లల్లో అనేక భావవ్యక్తీకరణలు మారిపోతాయని గుర్తించారు. అంటే ఒకే విషయంపై ఎక్కువగా దృష్టి సారించలేరు. అన్ని రకాలుగా ఆలోచిస్తారు. ఏ పని సక్రమంగా పూర్తి చేయరు. ముఖ్యంగా పిల్లలు చదువుపై శ్రద్ధ చూపలేకపోతుంటారు. చిన్న విషయానికే పెద్దగా ఐరానా పడుతుంటారు. సమస్యలు పరిష్కరించుకోవడంలో ఇబ్బందులకు గురవుతారు. ఇవన్నీ ఏడి హెచ్డి పెరుగుదలకు కారణమే అని అంటున్నారు.
అలాగే ADHD పెరుగుదలకు కారణం సోషల్ మీడియానే అని తెలుస్తోంది. సోషల్ మీడియా ఎక్కువగా చూసే పిల్లలందరూ ఏకాగ్రతను కోల్పోతున్నారు. 9 సంవత్సరాల ఒక పిల్లవాడు ఒకరోజులో 30 నిమిషాల పాటు సోషల్ మీడియాను చూస్తున్నట్లు తెలిపారు. అలాగే 13 సంవత్సరాల పిల్లవాడు 2.5 గంటలపాటు సోషల్ మీడియాను చూస్తున్నాడు. అంటే కనీసం ఒక రోజులో రెండు నుంచి మూడు గంటల పాటు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భారీ మానసిక స్థితి తీవ్రంగా మారిపోయే అవకాశం ఉంది.
ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని కరవలింకా ఇనిస్టిట్యూట్ మహిళా విభాగం పరిశోధకురాలు సామ్సన్ నివీన్స్ అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు డిజిటల్ వికాసాన్ని పరిచయం చేయడం తప్పు కాదని.. కానీ ఇది ఆరోగ్యకరమైనదిగా ఉంటేనే వారి భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. అదేపనిగా సోషల్ మీడియాను చూడటం వల్ల వారికి ఇతర విషయాలపై శ్రద్ధ ఉండదని అంటున్నారు. ఒక్కోసారి వారు ఆహారం తీసుకోవడంపై కూడా శ్రద్ధ చూపలేకపోతుంటారు. ఫలితంగా వారు తీవ్ర అనారోగ్యానికి గురై అవకాశం ఉంటుంది.
ఇక ADHD లక్షణాలను కూడా ఈ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు. ఈ లక్షణాలు ఉన్నవారు అదేపనిగా మొబైల్ చూస్తుంటారని.. వారి వద్ద నుంచి మొబైల్ తీసుకుంటే వారికి తీవ్రమైన కోపం వస్తుందని అంటున్నారు. అయితే మొబైల్ కు అడిక్టు అయిన వారు ఒకేసారి వదలలేరు. వారిని నెమ్మదిగా గాడ్జెట్ నుంచి దూరం చేసే ప్రయత్నం చేయాలి.