Laptop : ల్యాప్ టాప్ ఒళ్లో పెట్టుకొని పనిచేస్తున్నారా? అయితే డేంజరే

నిరంతరం ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కాళ్ల నొప్పులు, వాపులు రావడం సహజమే. ఈ నేపథ్యంలో కూర్చుని గంటల తరబడి కూర్చోవడం ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇది ఆరోగ్యానికి హానికరమే అయినా తప్పడం లేదు. కొన్ని జాగ్ర్తత్తలు తీసుకుంటే మంచిది.

Written By: Srinivas, Updated On : June 5, 2023 4:11 pm
Follow us on

Laptop : ప్రతి ఒక్కరూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇంటి నుంచే పనులు చేయడం వల్ల ల్యాప్ టాప్, డెస్క్ టాప్ తో చేస్తున్నారు. దీంతో ఎక్కువ సేపు కూర్చుని చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. నిరంతరం ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కాళ్ల నొప్పులు, వాపులు రావడం సహజమే. ఈ నేపథ్యంలో కూర్చుని గంటల తరబడి కూర్చోవడం ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇది ఆరోగ్యానికి హానికరమే అయినా తప్పడం లేదు. కొన్ని జాగ్ర్తత్తలు తీసుకుంటే మంచిది.

కరోనా సమయంలో..

కరోనా సమయంలో అన్ని సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రవేశపెట్టాయి. దీంతో అన్ని సంస్థలు ఇదే విధానానికి మొగ్గు చూపాయి. ఇంటి నుంచి పని చేయడానికి అనుమతి ఇచ్చాయి. అప్పటి నుంచే వర్క్ ఫ్రం హోం పద్ధతి అమల్లోకి వచ్చింది. అందువల్ల ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లాంటి వాటితో ఇంటి దగ్గర నుంచే పని చేస్తున్నారు. దీనివల్ల కూర్చుని చేసే పని చేసేందుకు సిద్ధమయ్యారు.

శారీరక బరువు పెరుగుదల

ఇంటి నుంచి పనిచేయడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. బరువు పెరిగేందుకు ఇది కారణంగా నిలుస్తుంది. గంటల తరబడి మంచం మీద కానీ కుర్చీ మీద కాని కూర్చుని పనిచేయడం వల్ల అధిక బరువు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నడుము చుట్టు కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల ఎన్నో రోగాలకు కారణంగా నిలుస్తోంది.

బద్ధకం

ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లతో పని చేయడం వల్ల బద్ధకం కూడా పెరుగుతుంది. దీంతో సోమరులుగా మారుతారు. బెడ్ పై కూర్చుని ల్యాప్ టాప్ తో పనిచేస్తుంటాం. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా తప్పని పరిస్థితుల్లో అలా చేయడానికి ఇష్టపడుతుంటాం. మంచం మీద కూర్చుని పని చేయడం వల్ల బద్ధకం ఆవహిస్తుంది.

వెన్నునొప్పి

కుర్చీలు, మంచం మీద కూర్చుని పనిచేయడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. కుర్చీలో వెనకకు వంగి పని చేయం. ముందుకు వంగి కూర్చోవడం వల్ల వెన్నుపూస వంగి ఉంటుంది. అందుకే వెన్ను నొప్పి బాధిస్తుంది. ల్యాప్ టాప్ ను ఒళ్లో పెట్టుకుని పని చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కొందరిలో ఇది చర్మ క్యాన్సర్ కు దారి తీస్తుంది.