Tirumala footpath journey: వేసవి సెలవులు ప్రారంభం కాగానే తిరుమలకు భక్తల తాకిడి ఎక్కువైంది. సూదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తిరుమల ప్రాంతమంతా భక్తజనసంద్రంతో నిండిపోతంది. అయితే తిరుమలకు వచ్చే భక్తుల్లో కొందరు నడకదారిని ఎందుకుంటారు. తిరుమలకు వెళ్లడానికి రెండు నడకదారులు ఉన్నాయి. అందులో ఒకటి అలిపిరి నుంచి ప్రారంభం అవుతుంది. మరొకటి శ్రీవారి మెట్లు. ఈ రెండుదారుల్లో నడిచేవారు.. ముందుగా ఆరోగ్య పరిస్థితులు అంచనావేసుకోవడం చాలా అవసరం. ప్రస్తుత మండే వేసవిలో ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే నడకదారిని ఎంచుకోవాలని అంటున్నారు. ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నవారు సైతం నడకదారి మధ్యలో అత్యవసర వైద్య సేవలను కూడా పొందవచ్చు. ఆ వివరాలే ఏవో చూద్దాం..
తిరుమల నడకదారి ప్రారంభించే ముందు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, బీపీ, షుగర్ ఉన్నవారు ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలి. వైద్యులు అనుమతి ఇస్తే తగినంత నీరు, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ వెంట తీసుకెళ్లాలి. తేలికపాటి, శ్వాసించగలిగే దుస్తులు ధరించడం మంచిది. ఉదయం వేళల్లో లేదా సాయంత్రం తర్వాత నడక ప్రారంభిస్తే ఎండ ప్రభావం తగ్గుతుంది. ఎండ వేడి నుంచి తట్టుకునే అవకాశం ఉంటుంది.
మెట్ల మార్గంలో నడుస్తూ మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఒకేసారి ఎక్కువగా శ్రమించకుండా, మీ శక్తికి అనుగుణంగా నడవాలి. తలనొప్పి, తల తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆగి విశ్రాంతి తీసుకోవాలి. చిన్నపాటి స్నాక్స్, పండ్లు వెంట ఉంచుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది.
భక్తుల సౌకర్యార్థం తిరుమల నడకదారుల్లో వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలిపిరి నుంచి వెళ్లే నడకదారిలో 3చ650 మెట్లు ఉంటాయి. శ్రీవారి మెట్లు 21,00 ఉన్నాయి. అలిపిరి మార్గంలో 1500 మెట్టు వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే శ్రీవారి మెట్ల మార్గంలో 1200 మెట్టు వద్ద కూడా వైద్య సేవలను అందిస్తారు. ఈ సేవలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు వినియోగించుకోవచ్చు. ఇవే కాకుండా మెట్ల మార్గంలో గుండెపోటు, ఇతర అవస్థలు పడితే అత్యవసర వైద్య సేవలు అందించడానికి తితిదే భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటారు.
అదేవిధంగా మార్గమధ్యంలో తాగునీరు, భోజన సదుపాయాలు, షెల్టర్లు కూడా ఏర్పాటు చేశారు. వేడి నుంచి రక్షణ కోసం కవర్లు, షెడ్లు ఉండటం భక్తులకు ఉపశమనం ఇస్తుంది. కొంత దూరం దాటిన తర్వాత భక్తులకు ఉచితంగా పాలు, బటర్‌మిల్క్ వంటి పానీయాలు కూడా అందించే ఏర్పాట్లు ఉన్నాయి. తిరుమల నడకదారి ఒక ఆధ్యాత్మిక అనుభవం అయినప్పటికీ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. సరైన ప్రణాళికతో, తగిన విశ్రాంతితో, శరీర పరిస్థితిని గమనిస్తూ నడిస్తే ఈ యాత్ర సుఖంగా, సురక్షితంగా పూర్తి చేయవచ్చు.
