Exercise : యువకులకు ఉద్యోగం వచ్చిన తర్వాత వారి లైప్ స్టైల్ చాలా మారిపోతుంది. కొందరు ఉద్యోగానికి ముందు శరీరం పట్ల చాలా జాగ్రత్తలు పడతారు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత సమయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని సార్లు సరిగ్గా తినరు కూడా. ఇక రోజువారీ శారీరక శ్రమ, నిద్ర విషయం గురించి పట్టించుకోవడం కూడా మానేస్తారు. ఈ విషయాల్లో చాలా తేడాలు వస్తాయి. కానీ ఇలా తేడా రావడం వల్ల ఆరోగ్యకరమైన జీవితంలో ఎఫెక్ట్ అవుతుంది. మరి ఈ విషయం పట్ల కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో కొన్ని విషయాలు వెల్లడి అయ్యాయి. అవేంటో చూసేద్దాం.
ఉద్యోగం ప్రారంభించిన తర్వాత యువతలో శారీరక శ్రమ పెరుగుతుందని, అయితే కాలక్రమేణా అది గణనీయంగా తగ్గిపోతుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కువ శారీరక శ్రమలలో పాల్గొనే యువకులు ఉద్యోగం వచ్చిన తర్వాత పెద్దగా శ్రమ చేయరు. ఉదయం లేవగానే నార్మల్ పనులు. ఆ తర్వాత బస్సు జర్నీ, డ్రైవింగ్, వెయిట్ చేయడం వంటి నార్మల్ పనులు చేస్తారు. ఇవే వారికి పెద్ద పనులుగా మారతాయి. ఆఫీస్ లో కూర్చొని పని చేసే వారికి శారీరక శ్రమ చాలా తక్కువ అని చెప్పవచ్చు.
ఈ వ్యక్తుల శారీరక కార్యకలాపాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఇంటి నుంచి పని చేసేవారిలో శారీరక శ్రమ స్థాయిలలో అతిపెద్ద క్షీణత కనిపిస్తుంది. అయితే, పని ప్రారంభించిన తర్వాత అతని నిద్ర స్థాయిలో ఎటువంటి మార్పు లేదు. యూనివర్సిటీలోని మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (MRC) ఎపిడెమియాలజీ యూనిట్ నుంచి ఎలెనా ఆక్సెన్‌హామ్ కొన్ని విషయాలను తెలిపారు. ‘మనం జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, చురుకుగా ఉండటం చాలా అవసరం. దీన్ని సాధించడానికి ముఖ్యమైన మార్గాలను వెతకాలి.
ఇంటి నుండి పని చేసే వారికి ముఖ్యమైన సలహా ఏంటంటే?
ఇంటి నుంచి పని చేసే వ్యక్తులు రోజంతా శారీరక శ్రమలు చేయడం గురించి ఆలోచించాలని ఆక్సెన్‌హామ్ సూచించారు. పనికి ముందు లేదా తర్వాత, లేదా మధ్యాహ్న భోజన సమయంలో వాకింగ్ మస్ట్. కాస్త కచ్చితంగా నడవాలి.
ఈ వ్యక్తులపై అధ్యయనం జరిగింది..
ఈ అధ్యయనంలో, 16-30 సంవత్సరాల వయస్సు గల 3,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల డేటా విశ్లేషించారట. వీరంతా 2015 నుంచి 2023 మధ్య తొలిసారిగా ఉద్యోగాలు ప్రారంభించారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బిహేవియరల్ న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీలో ప్రచురించరం అయిన ఫలితాల ప్రకారం, ఉద్యోగం ప్రారంభించిన తర్వాత సగటున 28 నిమిషాల మితమైన కార్యాచరణ (సైక్లింగ్ వంటివి) పెరిగాయట. అయితే, తర్వాత ఈ యాక్టివిటీ తగ్గింది అని తేలింది.
నిద్ర రేటు కూడా తగ్గింది
ఉద్యోగం పొందిన తర్వాత యువకుల నిద్ర రాత్రికి 10 నిమిషాలు తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. యువకులలో ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ, నిద్ర వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించాలని పరిశోధకులు కోరారు. దీనివల్ల ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్యం కారణంగా తక్కువ సెలవు తీసుకుంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.