https://oktelugu.com/

Weight Loss: బరువు తగ్గడం కోసం తిండి మానేస్తున్నారా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్?

Weight Loss: ప్రస్తుత కాలంలో ఊబకాయం వల్ల చాలామంది బాధ పడుతున్నారు. బరువును తగ్గించుకోవడం కోసం కొంతమంది తిండి మానేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలామంది బరువు పెరుగుతామని భయపడుతున్నారు. అయితే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. రోటీలను ఆహారంలో భాగం చేసుకుంటే సులభంగా బరువు తగ్గే అవకాశం ఉందని చెప్పవచ్చు. బరువు తగ్గాలని అనుకునే వాళ్లు జొన్న పిండిని ఆహారంలో భాగం చేసుకోవాలి. గ్లూటెన్ రహితమైన జొన్నపిండిని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 6, 2021 / 08:12 AM IST
    Follow us on

    Weight Loss: ప్రస్తుత కాలంలో ఊబకాయం వల్ల చాలామంది బాధ పడుతున్నారు. బరువును తగ్గించుకోవడం కోసం కొంతమంది తిండి మానేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలామంది బరువు పెరుగుతామని భయపడుతున్నారు. అయితే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. రోటీలను ఆహారంలో భాగం చేసుకుంటే సులభంగా బరువు తగ్గే అవకాశం ఉందని చెప్పవచ్చు.

    Weight Loss Tips

    బరువు తగ్గాలని అనుకునే వాళ్లు జొన్న పిండిని ఆహారంలో భాగం చేసుకోవాలి. గ్లూటెన్ రహితమైన జొన్నపిండిని తీసుకోవడం వల్ల ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేని వాళ్లు ఈ రకమైన ఆహారం తీసుకుంటే మంచిది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో జొన్న పిండి ఉపయోగపడుతుంది. జొన్న పిండిని కలుపుకునే సమయంలో కొద్దిగా గోధుమ పిండిని జోడించవచ్చు.

    గ్లూటెన్ ఫ్రీగా ఉండే రాగి పిండిలో అమైనో ఆమ్లాలు ఉండటంతో పాటు రాగి పిండితో చేసిన రొట్టెలను తినడం ద్వారా చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉండే అవకాశం ఉంది. రాగిపిండితో చేసిన రొట్టెలు సులువుగా జీర్ణం కావడంతో పాటు ఆకలి తగ్గి వేగంగా బరువు తగ్గవచ్చు. గ్లూటెన్ ఫ్రీగా ఉండే వాటిలో మిల్లెట్ పిండి కూడా ఒకటి. మిల్లెట్ పిండిలో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, ఇతర పోషకాలు లభిస్తాయి.

    Also Read: Pregnancy Food Avoid: ప్రెగ్నెన్సీ సమయంలో గర్భవతులు ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.. ఏవంటే?

    అతిగా తినకుండా నిరోధించటంలో మిల్లెట్ పిండి ఉపయోగపడుతుంది. మిల్లెట్ పిండితో చేసిన ఆహారం తింటే కడుపు నిండినట్లు అనిపించి ఎక్కువ సమయం దాహం వేస్తుంది. మిల్లెట్ పిండి తీసుకోవడం ద్వారా శరీరంలోకి ఎక్కువ నీటిని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వోట్స్ పిండి కూడా కడుపును చాలాకాలం పాటు నిండుగా ఉంచే అవకాశం ఉంటుంది. వోట్స్ పిండితో చేసిన రొట్టెలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటాయి.

    Also Read: Peanuts Side Effects: ఈ సమస్యతో బాధపడే వారు వేరుశనగకు దూరంగా ఉండాల్సిందే…?