Wisdom Teeth Removal: మానవ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం చాలా ప్రధానమైనదే. అయితే మొహం లోని అవయవాలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిలో ఏ ఒక్క దానికి సమస్య వచ్చినా తీవ్రమైన బాధ కలుగుతుంది. అయితే ఆహారం నమలడానికి.. ఘనమైన పదార్థాలను తీసుకోవడానికి నోటిలోని దంతాలు చాలా కీలకంగా ఉంటాయి. ఈ దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే సరైన ఆహారం తీసుకోగలుగుతాం. అయితే ఒక్కోసారి దంతాల సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా వీటిలో ముఖ్యమైన జ్ఞాన దంతం పై అదనపు పన్ను రావడం.. లేదా ఆ పన్ను సమస్యను ఎదుర్కోవడం వల్ల దానిని తీసేసుకోవాలని చాలామంది భావిస్తారు. కానీ జ్ఞాన దంతం తీసేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయని జపాన్, అమెరికాకు చెందిన వైద్య పరిశోధకులు తేల్చారు. ఇంతకీ వారు చెబుతున్న ప్రకారం ఏంటంటే?
ప్రతి వ్యక్తికి 17 నుంచి 25 ఏళ్ల మధ్య మూడో మోలార్ దంతం వస్తుంది. ఈ వయసులోనే మనిషికి బుద్ధి, జ్ఞానం ఏర్పడతాయి. అందుకే ఈ సమయంలో వచ్చే దంతాన్ని జ్ఞాన దంతమని అంటారు. ప్రతి వ్యక్తికి పై దవడలో రెండు.. కింది తేడాలో రెండు జ్ఞాన దంతాలు ఉంటాయి. కొంతమందికి పైన ఒకటి.. కింద ఒకటి ఉండే అవకాశం ఉంటుంది. అయితే అప్పటికే వచ్చిన దంతాలకు అదనంగా ఈ జ్ఞాన దంతం పెరగడంతో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్న పన్నుపై జ్ఞాన దంతం పెరగడంతో పన్నుపై పన్ను వచ్చి వికారంగా కనిపించడం.. లేదా నొప్పి రావడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కొంతమంది వైద్యులు జ్ఞాన దంతమును తొలగించాలి అని అంటారు. కానీ విపరీతమైన పరిస్థితిలో లేదా నోటిలో తీవ్రమైన సమస్యలు ఉంటే మాత్రమే జ్ఞాన దంతాన్ని తొలగించాలి.
అయితే ఇటీవల National Institute of Advanced Industrial Science and Technology, University of Evoda అనే సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేసి సంచలన విషయాలను బయటపెట్టారు. జ్ఞాన దంతాలకు శరీరంలోని ప్రధానమైన కణాలు లింక్ అయి ఉంటాయని తెల్చారు. మిషన్ కైమాల్ అనే మూల కణాలు జ్ఞాన దంతానికి కనెక్ట్ అయి ఉంటాయని.. వీటికి గుండె కణాలు, ఇతర అవయవాలకు చెందిన కణాలు లింకు అయి ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా గుండె జబ్బులు, ఇతర వ్యాధులను గుర్తించడానికి జ్ఞాన దంతానికి చెందిన కణాలు ఎంతో ఉపయోగపడతాయని తేల్చారు. అందువల్ల జ్ఞాన దంతాలను సాధారణ దంతాలు అనుకోవద్దని.. ఇవి శరీరంలో ఎంతో ముఖ్యమైనవిగా భావించాలని వైద్యులు తేల్చారు. అంతేకాకుండా విపరీతమైన సమస్య ఉంటే తప్ప జ్ఞాన దంతాలను తీసివేయకుండా ఉండాలని వైద్యులు పేర్కొన్నారు.
అయితే చాలామంది జ్ఞాన దంతాలతో ఎన్నో రకాల సమస్యలతో బాధపడతారు. వీటికి సమస్యలు రావడం వల్ల నోటితోపాటు తల మొత్తం భారంగా ఉండి అనేక అవస్థలకు గురయ్యే ప్రమాదం ఉందని అంటుంటారు.