earwax : చెవిలో గులిమి తీస్తున్నారా? చాలా పెద్ద తప్పు చేస్తున్నారు? ఎందుకంటే?

జ్ఞానేంద్రియాలలో చెవికి చాలా ప్రాముఖ్యత ఉంది. చెవి బయట నుంచి వచ్చే సూక్ష్మజీవులు లోపలికి పోకుండా గులిమి చాలా సహాయం చేస్తుంది. చెవికి గులిమి చెలిమి మాదిరి ఉంటుంది. అయితే ఈ విషయం తెలియకుండా చాలామంది చెవిలో ఏదో ఒకటి పెడుతుంటారు. గులిమిని బయటకు తీయాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. దీంతో చెవి నొప్పి, ఇన్ఫెక్షన్స్, వినికిడి లోపం వంటి సమస్యలు వస్తుంటాయి. ఆహారం తింటున్నప్పుడు దవడలు కదులుతాయి. ఈ సమయంలో చెవిలో ఉండే గులిమి వాటంతట అదే బయటకు పోతుంది. అయితే చెవిలో గులిమి ఉంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి.

Written By: Swathi Chilukuri, Updated On : October 22, 2024 4:57 pm

Are you getting earwax? Making a huge mistake? Because?

Follow us on

earwax : చెవిలో గులిమి ఉండటం మంచిదే అంటున్నారు నిపుణులు. ఇది చెవిని రక్షిస్తుందట. చెవిలో గులిమి దానంతట అదే బయటకు పోతోంది కాబట్టి మీరు గులిమిని బయటకు తీసే ప్రయత్నాలు చేయవద్దు. దీన్ని బయటకు తీయడం అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అంతేకాదు చెవులు తమకు తాము క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ గులిమి సహాయం చేస్తుందట. సూక్ష్మక్రిముల నుంచి కాపాడుతుంది ఇది.దుమ్ము, హానికారక వస్తువులను చెవి లోపలికి పోనివ్వకుండా అడ్డుపడుతుంది ఈ గులిమి. ఇక దీన్ని తీయడానికి ప్రయత్నిస్తే సమస్య మరింత పెద్దగా అవుతుంది. గులిమి మరింత లోపలికి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.

స్విమ్మింగ్, స్నానం చేస్తున్నప్పుడు చెవిలోకి వాటర్ వెళ్తుంది. కానీ లోపలికి వాటర్ వెళ్లకుండా చూసుకోవాలి. దీనివల్ల కార్టిలైజ్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. తరచూ చెవిలో ఎదో ఒకటి పెట్టి గులిమి తీయవద్దు. ఇలా చేస్తే చెవిలోని కర్ణభేరి పొర దెబ్బతింటుంది.
బయట ఎవరైనా గులిమి తీస్తామంటే చెవిని ఇచ్చేయకండి. వద్దని సింపుల్ గా చెప్పేయండి. నొప్పి రాకుండా చెవిలో గులిమి బయటకు తీయగలమని అనిపిస్తే ప్రయత్నించవచ్చు కానీ చాలా జాగ్రత్త అవసరం. లేకుంటే నిపుణులను సంప్రదించడం అవసరం. చెవిలో గులిమి తీసేందుకు చెవి నాళం కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న వాటిని వాడటం వల్ల సమస్యలు వస్తాయి. కొంతమందికి చెవిలో ఏదో ఒకటి పెట్టి తిప్పుకునే అలవాటు కంటిన్యూగా ఉంటుంది. దీనివల్ల చెవిపోటు సమస్యలు వస్తుంటాయి. ఈ అలవాటును మానుకుంటే మీకు, చెవికి  మంచిది.

చిన్న పిల్లలకు చెవిలో గులిమి తీసేందుకు క్లాత్ ను వినియోగిస్తుంటారు. ఇలా చేయవద్దు. దీనివల్ల గులిమి ఇంకాస్త లోపలికి వెళ్తుంది. సో వినికిడి సమస్యలు వస్తుంది. గులిమి ఎండిపోయి రాళ్లలా మారితే అలాంటప్పుడు ఇయర్ డ్రాప్స్ వేసి మెత్తగా అయ్యేలా చూసుకోండి. అయితే ఈ సమస్య ఒక శాతం మందిలో మాత్రమే వస్తుంది. వాతావరణం చల్లగా ఉంటే, వర్షం పడినప్పుడు చెవిలోకి నీరు చేరి గులిమి ఉబ్బుతుంది. దీనివల్ల చెవి నొప్పి వస్తుంది. అందుకే చల్లటి వాతావరణంలో చెవిలోకి నీరు చేరకుండా జాగ్రత్త పడాలి.

బయటకు వెళ్లేటప్పుడు దుమ్ము, ధూళి, పొగ వలన చెవిలో వ్యర్థాలు చేరే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవే చెవి పోటుకు కారణం అవుతాయి అంటున్నారు నిపుణులు. అయితే బయటకు వెళ్లేటప్పుడు చెవికి రక్షణ ఏర్పరచుకోవడం మరింత మంచిది. పరిస్థితి తీవ్రంగా ఉంటే సొంత వైద్యం మానేయాలి.  వైద్యులను సంప్రదించాలి.