Cheap Biryani: ఆదివారం వచ్చినా.. ఇంట్లో బర్త్డే పార్టీ ఉన్నా.. ఇంటికి చుట్టాలు వచ్చినా… ప్రత్యేకమైన ఆహారం చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. వీటిలో ఎక్కువమంది ఇష్టపడేది బిర్యాని. చికెన్ లేదా మటన్ తో చేసిన బిర్యాని తో కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకోవాలని అనుకుంటారు. అయితే కొంతమందికి రెగ్యులర్ గా బిర్యానీ తినే అలవాటు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో రూ. 200 నుంచి రూ.400 వరకు ప్లేట్ బిర్యాని విక్రయిస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో వినియోగదారులను ఆకర్షించేందుకు రూ.100 కే అమ్ముతున్నారు. అయితే తక్కువ ధరకే బిర్యానీ వస్తుందని చాలామంది దీనికోసం ఎగపడుతున్నారు. అసలు వీరు ఇంత తక్కువకు బిర్యాని ఎలా ఇవ్వగలుగుతున్నారు?
Also Read: చంద్రబాబు ప్రభుత్వం పై మరో బాంబు పేల్చిన ఆర్కే
మార్కెట్లో క్వాలిటీ, డిస్ క్వాలిటీ అనే రెండు రకాల పదార్థాలు ఉంటాయి. వీటిని వినియోగదారులు గుర్తిస్తే.. ఎలాంటి ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. కానీ చాలామంది తక్కువ ధరకు వచ్చేవాటి వైపే ఎక్కువగా మొగ్గుచూపుతారు. ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో తక్కువ ధరకు ఏది వస్తే వాటినే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇదే క్రమంలో చికెన్ బిర్యాని తినాలని ఆసక్తి ఉన్నవారు ఎక్కడ తక్కువకు విక్రయిస్తే అక్కడ ఎగబడి తింటారు. అయితే వారు ఇంత తక్కువకు ఇవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా ఒక కోడిని కొనుగోలు చేస్తే రూ.200 నుంచి రూ.300 వరకు ఉంటుంది. అలాంటిది.. బాస్మతి రైస్ తో పాటు చికెన్, ఇతర పదార్థాలను కేవలం రూ.100 కే అందిస్తున్నారు.
అయితే వీరు ఉపయోగించే పదార్థాల్లో చాలావరకు కల్తీ వి ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని హోటల్స్ లో ఒకరోజు మిగిలిన ఆహారాన్ని మరుసటి రోజు వినియోగించే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. అంతేకాకుండా అనారోగ్యంతో ఉన్న కోళ్లను తక్కువ ధరకే రెస్టారెంట్, ఫుడ్ సెంటర్లకు పంపిణీ చేస్తున్నారని కొందరు చెబుతున్నారు. బాస్మతి రైస్ వినియోగంలో కూడా వీరు తక్కువ క్వాలిటీది ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పాతబడిపోయిన బియ్యం లేదా నాసిరకం బియ్యం ను ఉపయోగించి బిరియానిని తయారు చేస్తున్నారని అంటున్నారు. ఇలా అన్ని తక్కువ ధరకే ముడి పదార్థాలను తీసుకువచ్చి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారని.. అందుకే తక్కువ ధరకే బిర్యానీ అందిస్తున్నారని పేర్కొంటున్నారు.
ఈ విషయాలపై కొందరు ఇప్పటికే ఫిర్యాదు చేయగా.. హైదరాబాదు తో పాటు పట్టణాల్లో ఇప్పటికే విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుల తరబడి ఫ్రిజ్లో ఉంచిన ఆహారాన్ని వినియోగిస్తున్నారని.. ఒకరోజు మిగిలిపోయిన ఆహారం ఫ్రిజ్లో ఉంచి మరో రోజు వినియోగిస్తున్నారని వెల్లడైంది. అంతేకాకుండా ఆహార పదార్థాలు వన్డే ప్రాంతంలో ఎలాంటి పరిశుభ్రత లేకుండా ఉంటుందని అధికారులు గుర్తించారు. ఇక బిర్యానీలో ఉపయోగించే ఫుడ్ కలర్ ఇతర ఆహార పదార్థాలు అన్ని నాసిరకంగా ఉండడం బట్టి తక్కువ ధరకు అందిస్తున్నారని అంటున్నారు.
అందువల్ల తక్కువ ధరకే బిర్యానీ వస్తుందని ఆశపడి తినడం వల్ల.. అనేక అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బిర్యానీ తినాలని అనుకుంటే కావాల్సిన వస్తువులను తీసుకువచ్చి ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిదని.. లేదా క్వాలిటీ రెస్టారెంట్ లోకి వెళ్లే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.