Platelet Count: ప్రస్తుత కాలంలో రక్తహీనత సమస్యతో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రక్తహీనతతో బాధ పడేవాళ్లకు ప్లేట్ లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల పండ్లు, ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా సులభంగా ప్లేట్ లెట్స్ ను పెంచుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్లు, డెంగ్యూ, మలేరియా వల్ల శరీరంలో ప్లేట్ లెట్లు తగ్గే అవకాశం అయితే ఉంటుంది.
కొంతమందికి జన్యు సమస్యల వల్ల ప్లేట్ లెట్స్ తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని మందులను వాడటం ద్వారా కూడా ప్లేట్ లెట్స్ తగ్గుతాయి. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు వాడే మందులు ప్లేట్ లెట్లు తగ్గడానికి కారణమవుతాయి. ప్లేట్ లెట్స్ తక్కువగా ఉంటే గాయం కాకపోయినా రక్తస్రావం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
Also Read: నిద్రపోయే ముందు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు… చేస్తే సమస్యలు తప్పవు!
ఎర్ర రక్త కణాలలో ఉండే హిమో గ్లోబిన్ ద్వారా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ లభించే అవకాశం ఉంటుంది. తెల్ల రక్తకణాలు శరీరం రోగాల బారిన పడకుండా చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ప్లేట్ లెట్ల సంఖ్యను సులభంగా పెంచుకోవచ్చు. రోజుకు రెండుసార్లు ఆఫ్రికాట్ పండ్లను తీసుకుంటే ప్లేట్ లెట్ల సంఖ్య పెరుగుతుంది.
కివీ పండ్లు, ఎండు ఖర్జూరం తినడం ద్వారా కూడా ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవడం సాధ్యమవుతుంది. దానిమ్మ, బొప్పాయి పండ్లను తినడం ద్వారా కూడా ప్లేట్ లెట్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆకుపచ్చగా ఉండే ఆకు కూరలు, కూరగాయలను ఎక్కువగా తింటే ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది. బీట్ రూట్, క్యారెట్ తినడం ద్వారా కూడా ప్లేట్ లెట్స్ సంఖ్యను పెంచుకోవచ్చు.
Also Read: బీట్ రూట్ తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వాళ్లకు ప్రమాదమట?