Corona Effects: కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు మరో షాక్.. అలాంటి సమస్యలు వస్తాయట!

Corona Effects: గడిచిన రెండేళ్లుగా దేశంలోని ప్రజలను కరోనా వైరస్ గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామందిని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఆ సమస్యలలో కొన్ని ఆరోగ్య సమస్యలు మరీ ప్రమాదకరంగా ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమందిని తల తిరగడం సమస్య వేధిస్తుంది. ఇంగ్లీష్ లో వర్టిగో అని పిలవబడే ఈ వ్యాధి కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామందికి ఇబ్బందులను క్రియేట్ చేస్తోంది. కరోనా వైరస్ […]

Written By: Navya, Updated On : February 2, 2022 8:08 am
Follow us on

Corona Effects: గడిచిన రెండేళ్లుగా దేశంలోని ప్రజలను కరోనా వైరస్ గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామందిని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఆ సమస్యలలో కొన్ని ఆరోగ్య సమస్యలు మరీ ప్రమాదకరంగా ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమందిని తల తిరగడం సమస్య వేధిస్తుంది. ఇంగ్లీష్ లో వర్టిగో అని పిలవబడే ఈ వ్యాధి కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామందికి ఇబ్బందులను క్రియేట్ చేస్తోంది.

కరోనా వైరస్ శరీరంలోని ప్రధాన అవయవాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత దీర్ఘకాలికంగా కొన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. వెర్టిగో బారిన పడిన వాళ్లు బలహీనంగా ఉంటారు. వీళ్లకు తమ చుట్టూ ఉన్న ప్రపంచం కదులుతోందని అనిపిస్తుంది. బలహీనత, బద్ధకం, అస్థిరత లాంటి సమస్యలు వేధిస్తుంటే వైద్యుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి.

ఈ లక్షణం కరోనా దీర్ఘకాలిక లక్షణాలలో ఒకటని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. తల తిరిగితే రోడ్డుపై నడిచే సమయంలో కూడా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలా తక్కువమందిలో ఈ సమస్య కనిపిస్తుండటం గమనార్హం. కరోనా నుంచి కోలుకునే సమయంలో శరీరంపై ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి.

కష్టమైన పనులకు దూరంగా ఉంటూ వీలైనంత ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ వైద్యులు సూచించిన మందులను వాడటం ద్వారా ఈ సమస్య సులభంగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.