https://oktelugu.com/

Angry: ఎక్కువగా కోపానికి గురవుతున్నారా.. ఈ వ్యాధులకు మీరు తావు ఇచ్చినట్లే

కోపం రావడమనేది సహజమే. ప్రతీ ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో కోపానికి (Angry) గురవుతుంటారు. అనుకున్నది కాకపోయినా, నచ్చినది దొరక్క పోయినా కూడా కొందరు ఆగ్రహానికి (Angry) గురవుతుంటారు. అయితే కొందరికి ఎంత కోపం వచ్చినా కూడా ఆగ్రహానికి గురి కారు. కానీ మరికొందరు మాత్రం కారణం లేకుండానే కోపానికి గురవుతుంటారు. ఎక్కువగా కోపానికి గురైతే మాత్రం ఒత్తిడి (Stress), ఆందోళన పెరగడం, మానసిక సమస్యలు అన్ని కూడా వస్తాయని నిపుణులు చెబుతుంటారు.

Written By: , Updated On : January 26, 2025 / 06:00 AM IST
Angry

Angry

Follow us on

Angry: కోపం రావడమనేది సహజమే. ప్రతీ ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో కోపానికి (Angry) గురవుతుంటారు. అనుకున్నది కాకపోయినా, నచ్చినది దొరక్క పోయినా కూడా కొందరు ఆగ్రహానికి (Angry) గురవుతుంటారు. అయితే కొందరికి ఎంత కోపం వచ్చినా కూడా ఆగ్రహానికి గురి కారు. కానీ మరికొందరు మాత్రం కారణం లేకుండానే కోపానికి గురవుతుంటారు. ఎక్కువగా కోపానికి గురైతే మాత్రం ఒత్తిడి (Stress), ఆందోళన పెరగడం, మానసిక సమస్యలు అన్ని కూడా వస్తాయని నిపుణులు చెబుతుంటారు. ఏ విషయాన్ని అయిన కూడా ఆగ్రహంతో కాకుండా కూల్‌గా పరిష్కరించుకోవాలని అంటుంటారు. అయినా కూడా చాలా మంది వినకుండా ప్రతీ చిన్న విషయానికి కూడా కోపానికి గురవుతుంటారు. ఎవరి కోపం వారికే శత్రవు అని మన పెద్దలు చెబుతుంటారు. వైద్యులు కూడా ఇదే చెబుతున్నారు. ఎక్కువగా కోపానికి గురైతే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎవరైతే చీటికి మాటికి కోపానికి గురైతే.. రక్తపోటు పెరిగిపోవడంతో పాటు డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ అధికంగా, చాలా సార్లు కోపానికి గురైతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.

కారణం లేకుండా ఎక్కువగా కోపానికి గురైతే తప్పకుండా ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తలనొప్పి, జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, నిద్ర సమస్యలు, ఆందోళన పెరగడం, డిప్రెషన్, అధిక రక్తపోటు, చర్మ సంబంధిత సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కోపం వల్ల లాభాలు కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా కోపానికి గురికావద్దు. మీరు మీ కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కారణం లేకుండా ఎక్కువగా కోపం వస్తుందంటే మీరు యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. వీటి వల్ల కొంత వరకు కోపం తగ్గుతుంది.

మీకు కోపం వస్తే ఎదుటి వారి మీద చూపించకుండా ప్రయత్నించండి. ఉదాహరణకు కోపం వస్తే కళ్లు మూసుకోవడం లేదా మొబైల్ చూడటం వంటివి చేయండి. ఇలా ఏదో విధంగా డైవర్ట్ కావడం వల్ల మీరు ఇతరులపై కోపం చూపించరు. కోపం వస్తే ఏదైనా తినడం లేదా ఒక గ్లాసు నీరు తాగడం, శ్వాస తీసుకోవడం, పాటలు వినడం, పాడటం, ఇష్టమైన పని చేయడం వంటివి చేయాలి. ఇలా చేస్తే తప్పకుండా కోపం నుంచి బయట పడతారు. కోపం వల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా చర్మ సౌందర్యం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఎక్కువగా ఆగ్రహానికి గురి కావడం వల్ల ముఖంతో కాంతివంతం కనిపించదు. ఏదో కోల్పోయినట్లు ఉంటారు. అసలు ఎంత తెల్లగా ఉన్నా కూడా నల్లగా కనిపిస్తారు. నిజానికి ముఖంలో చిరునవ్వు కూడా ఉండదు. అదే సంతోషంగా ఉంటే ఫేస్‌ అందంగా కనిపిస్తుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.