Corona Vaccine: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విషయంలో వేగం పెంచిన సంగతి తెలిసిందే. ఈ నెల 3వ తేదీనుంచి 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మద్య వయస్సు ఉన్నవాళ్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కరోనా వ్యాక్సిన్ విషయంలో పిల్లలు ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయిస్తే మంచిది.
అయితే కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ విషయంలో చాలామందికి అపోహలు ఉన్నాయి. లాన్సెట్ కమిషన్ సభ్యురాలు ప్రొఫెసర్ డాక్టర్ సునీలా గార్గ్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పిల్లలు జ్వరం లేదా ఒళ్లు నొప్పులతో బాధపడితే కంగారు పడవద్దని సూచనలు చేశారు. తల్లిదండ్రులు వ్యాక్సిన్లు తీసుకునేలా పిల్లలను ప్రేరేపించాలని సునీలా గార్గ్ తెలిపారు.
Also Read: గాడిద పాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా.. ఆ సమస్యలకు చెక్!
పిల్లలు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడితే తల్లిదండ్రులు పిల్లలు తిన్నారో లేదో చూసుకోవాలని అన్నారు. పిల్లలు తిన్నారో లేదో చెక్ చేసుకుని వ్యాక్సిన్ వేయించాలని అధిక జ్వరం లేదా వాంతులు, అతిసారంతో బాధ పడుతుంటే వ్యాక్సిన్ వేయించకూడదని సూచనలు చేశారు. రాత్రంతా పిల్లవాడు నిద్రపోయాడో లేదో చెక్ చేసుకోవాలని సునీలా గార్గ్ చెప్పుకొచ్చారు.
కొన్నిసార్లు వ్యాక్సిన్ వేసిన తర్వాత పిల్లలకు జ్వరం, నొప్పి, వాపు వస్తాయని సునీలా గార్గ్ పేర్కొన్నారు. పిల్లల్లో కళ్లు తిరగడం, అలెర్జీ, ఇతర తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే మాత్రం వైద్యుడిని సంప్రదించాలని సునీలా గార్గ్ వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పిల్లలకు కరోనా వచ్చే ఛాన్స్ తగ్గుతుందని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా పిల్లలు రక్షణ నియమాలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సునీలా గార్గ్ చెప్పుకొచ్చారు.
Also Read: ‘పుష్ప’కి దూరంగా ఉంది అతనొక్కడే !