Smart Phones: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే మాత్రమే ఎన్నో పనులను సులభంగా చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. యాప్స్ సహాయంతో నిత్యం ఆరోగ్యం, బ్యాంక్ ఖాతాలు, విద్యకు సంబంధించిన వివరాలను ట్రాక్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడటం వల్ల క్యాన్సర్ లేదా ఇతర ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది.
సెల్ ఫోన్ ద్వారా రిలీజయ్యే రేడియేషన్స్ ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతాయని చెప్పవచ్చు. జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్ కొత్త స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన సమగ్ర డేటాను అధ్యయనం చేసి ఇచ్చింది. ఎక్కువ మరియు తక్కువ రేడియేషన్ ఉద్గారాలు ఉన్న స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. స్పెసిఫిక్ అబ్సర్ప్షన్ రేట్ ద్వారా sar విలువను తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
ఎక్కువ రేడియేషన్ ను రిలీజ్ చేసే స్మార్ట్ ఫోన్ల జాబితాను పరిశీలిస్తే ఈ జాబితాలో హెచ్.టీసీ కంపెనీకి చెందిన htc u12 life స్మార్ట్ ఫోన్ sar వాల్యూ 1.48గా ఉంది. వన్ ప్లస్ కంపెనీకి చెందిన 6టీ స్మార్ట్ ఫోన్ sar వాల్యూ 1.55గా ఉంది. ఎం.ఐ కంపెనీకి చెందిన ఏ1 ఫోన్ sar విలువ 1.58గా ఉంది. వన్ ప్లస్ కంపెనీకి చెందిన 5టీ మొబైల్ sar విలువ 1.68గా ఉంది. షియోమి ఎం.ఐ కంపెనీకి చెందిన మ్యాక్స్3 sar వాల్యూ 1.75గా ఉంది.
తక్కువ రేడియేషన్ ను రిలీజ్ చేసే స్మార్ట్ ఫోన్ల జాబితాను పరిశీలిస్తే సామ్ శంగ్ గెలాక్సీ ఎస్8 sar విలువ 0.26గా ఉంది. సామ్ శంగ్ గెలాక్సీ ఏ8 ఫోన్ sar విలువ 0.24గా ఉంది. ఎల్జీ జీ7 స్మార్ట్ ఫోన్ యొక్క sar వాల్యూ 0.24గా ఉంది. జెడ్.టీ.ఈ ఆక్సా ఎలైట్ sar విలువ 0.17గా ఉంది. సామ్ శంగ్ గెలాక్సీ sar విలువ 0.17గా ఉంది.
Also Read: వాట్సాప్ చాట్ డిలీట్ అయిందా.. ఏ విధంగా రికవరీ చేయాలంటే?
వాట్సాప్ సెక్యూరిటీ కోడ్ నోటిఫికేషన్లు వస్తున్నాయా.. వాటిని ఎలా ఆపాలంటే?