Homeలైఫ్ స్టైల్Health effects of Air pollution: గాలి కాలుష్యంతో కిడ్నీ వాపు..

Health effects of Air pollution: గాలి కాలుష్యంతో కిడ్నీ వాపు..

Health effects of Air pollution: ప్రస్తుత కాలంలో గాలి కాలుష్యం ఊపిరితిత్తులను పాడు చేయడం మాత్రమే కాదు కిడ్నీలపై కూడా చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. ప్రధానంగా వాహనాల నుంచి వచ్చే ప్రమాదకరమైన పొగలో ఉండే చిన్నపాటి కణాలు, ప్రత్యేకించి పీఎం 2.5 (PM2.5) అనే పార్టికులేట్ మ్యాటర్ వల్ల కిడ్నీలపై మార్పులు సంభవిస్తున్నట్లు పరిశోధకులు గమనించారు.

తాజాగా వెలుగు చూసిన డేటా ప్రకారం .. గాలిలో ఎక్కువగా పీఎం 2.5 ఉన్న ప్రాంతాల్లో నివసించే వారిలో కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం సుమారు నాలుగు రెట్లు పెరిగిందని పరిశోధకులు గుర్తించారు. అంటే గాలిలో ఈ హానికరమైన కణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు కిడ్నీ సమస్య కోసం ఆసుపత్రుల్లో చేరే వారిసంఖ్య మిగతా ప్రాంతాల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. ప్రత్యేకించి హై ట్రాఫిక్ రోడ్ల దగ్గర, పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పొగలోని కణాలు కిడ్నీల లోపల చేరిన తర్వాత అక్కడ వాపు ను ప్రేరేపిస్తాయి, ఇది క్రమంగా కిడ్నీ కణజాలాన్ని దెబ్బతీసి, వాటి ఫిల్టరింగ్ పనితీరు తగ్గేలా చేస్తోంది.

పరిశోధకులు చెప్పిన ప్రకారం.. ఈ గాలి కాలుష్యం కారణంగా కిడ్నీలు చిన్న వయసులోనే క్షీణించడం కూడా సంభవిస్తోంది. సాధారణంగా 50 నుంచి 60 సంవత్సరాల తర్వాత కిడ్నీలు క్షీణించడం కనిపిస్తుంటే.. గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 30 నుంచి 40 సంవత్సరాల వయసులోనే కిడ్నీల పనితీరు గణనీయంగా పడిపోతోందని లేదా కిడ్నీ డిజీజ్‌లు ఏర్పడే అవకాశం పెరగడం గమనించారు. ఈ ప్రభావం ప్రత్యేకించి డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ లాంటి క్రానిక్ సమస్యలు ఉన్న వారిలో మరింత తీవ్రంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే, గాలి కాలుష్యం కిడ్నీలను ‘సైలెంట్ ’‌గా దెబ్బతీసే ఒక కారకంగా పరిగణిస్తున్నారు.

గాలి కాలుష్యాన్ని తగ్గించడం, పీఎం 2.5 స్థాయిలను నియంత్రించడం, ప్రజలు మాస్క్‌లు ధరించడం, ఎయిర్ ఫిల్టర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వంటివి ఉపయోగించడం మొదలైన చర్యలు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడుతాయని సూచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా రోడ్డు పక్క ప్రాంతాల్లో చెట్లు పెంచడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను మెరుగుపరచడం, పరిశ్రమల నుంచి వచ్చే వాయు కాలుష్యాన్ని నియంత్రించే పాలసీలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇలా గాలి కాలుష్యం–కిడ్నీ ఆరోగ్యం మధ్య ఉన్న బంధం గురించి ప్రజా అవగాహన పెంచడం ద్వారా ఈ సమస్య నుంచి కనీసం భాగం మాత్రం తప్పించుకోవడానికి అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version