Statins: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. సమయభావం లేకపోవంతో షార్ట్ కట్ ఫుడ్ ను తీసుకుంటారు. ఇవి తాత్కాలికంగా రెడీ అయి రుచిని ఇస్తాయి. కానీ దీర్ఘకాలికంగా అనేక వ్యాధులను తీసుకొస్తాయి. తరుచుగా ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ అధికం కావడంతో చాలా మంది వైద్యులను సంప్రదిస్తారు. కానీ అవగాహన ఉన్న వారు సొంత వైద్యంతో కొన్ని మెడిసిన్స్ వాడుతారు. వీటిలో స్టాటిన్స్ ఒకటి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయ పడుతాయి. అయితే కొందరు వీటిని వాడడం వల్ల కండరాలు క్షీణించిపోతాయి. కళ్లు కనిపించకుడా అవుతాయి. ఇంతకీ ఈ మెడిసన్ ఎవరు వాడకూడదో తెలుసా?
గుండె జబ్బులకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్. దీనిని తగ్గించుకోవడానికి స్టాటిన్ వాడుతూ ఉంటారు. స్టాటిన్స్ అనేది శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగించే ఔషద సమూహం. ఇది వాడడం వల్ల గుండెపోటు, పక్షవాతం 25 శాతం రాకుండా ఆపుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా స్టాటిన్ల వాడకంతో రిజల్ట్ త్వరగా ఉంటుందని కొందరు వైద్యులు చెబుతుంటారు. రక్తం ప్రవాహంలో కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు ఇది సహకరిస్తుంది. స్టాటిన్ లో ఆటోర్వాస్టాటిన్, సిమ్వాస్టాటిన్, రోసువాస్టాటిన్, ప్రవాస్టాటిన్ అనే రకాలున్నాయి.
స్టాటిన్లతో గుండెపోటు నుంచి రక్షణగా నిలుస్తాయి. అయితే కొందరికి మాత్రం ఇవి విషంగా మారుతాయి. యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRA) తెలిపిన వివరాల ప్రకారం మస్తీనియగా గ్రావిస్ ఉన్న రోగులు స్టాటిన్ తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. ఈ వ్యాధి ఉన్న వారు స్టాటిన్ వేసుకోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి తెలిపింది. MHRA ప్రకారకం ‘మస్తీనియగా గ్రేవిస్ ఉన్న వారు స్టాటిన్ వాడితే కంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది’ అని పేర్కొంది.
మస్తీనియా గ్రావిస్ అనేది ఆటో ఇమ్యూన్ న్యూరోముస్కులర్ డిజార్డర్. ఇది కంటి కదలికలు, ముఖ కవలికలు, మాట్లాడటం, మింగడం, అవయవ కదలికలు, శ్వాసన నియంత్రించే స్వచ్ఛంద కండరాల హెచ్చు, తగ్గులను తెలుపుతుంది. ఈ వ్యాధి సాధారణ లక్షణాలు కనురెప్పులు పడిపోవడం, వస్తువులు రెండుగా కనిపించడం, నమలడం లేదా మింగడంలో సమస్యలు, అవయవాలు బలహీనంగా మారిపోవడం, శ్వాస ఆడకపోవడం వంటివి ఉంటాయి.
ఇక స్టాటిన్స్ సాధారణ వ్యక్తుపై కొన్ని దుష్పరిణామాలు చూపే అవకాశం ఉందని నోయిడాలోని ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, మెంట్రో హాస్పిటల్స్ డాక్టర్ గ్యాంతి ఆర్బీఎస్ సింగ్ పేర్కోన్నారు. కండరాల బలహీనంగా మారుతాయి. స్టాటిన్ తీసుకునే కొంత మంది రోగుల్లో జీర్ణ సమస్యలు వస్తాయి. వాంతి, వికారం, అతిసారం వంటివి కలుగుతాయి. టైప్ 2 మధుమేహం ఉన్న వారు వీటితో అసౌకర్యంగా ఉంటారు. అయితే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో స్టాటిన్ ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉంటాయని మరికొందరు వైద్యులు తెలుపుతున్నారు.